డాకు మహారాజ్ సినిమాకి సంగీతం అందించిన తమన్ సినిమా సక్సెస్ మీట్ లో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ రోజు అనంతపురం వేదికగా నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది సినిమా యూనిట్. ఈ క్రమంలో తమన్ మాట్లాడుతూ అనంతపురం రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనంతపూర్ వచ్చి సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటామని చెప్పాను, చెప్పినట్టే కొట్టాం వచ్చాం అనుకుంటూ చెప్పుకొచ్చారు. నాకు ప్రతి సినిమా ఒక పదో తరగతి పరీక్ష లాంటిది. బాలకృష్ణ గారి సినిమా అంటే ఎలా చేయాలి? ఇంకా ఎంత బాగా చేయాలి అని ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను.. కేవలం నేను బాలకృష్ణ గారి సినిమాని నాది అనుకోవడం కాదు ఆ సినిమా చేసే డైరెక్టర్లు కూడా అంతే ప్రేమిస్తున్నారు. అఖండతో మొదలుపెట్టి రేపు రాబోతున్న అఖండ 2 ఎలా ఉండబోతుందో నాకు ముందే అర్థమైపోతుంది. డాకు మహారాజ్ తీసుకొచ్చి ఇక్కడ ఆపింది అఖండ 2 ఏం చేస్తుందో నాకు ముందే తెలుస్తుంది..
SS Thaman: థమన్ దెబ్బకి కొత్త ఉద్యోగం పుట్టిందిగా!
అది మామూలుగా ఉండదు.. మీరు ముందే ప్రిపేర్ అయిపోండి. బోయపాటి గారు అక్కడ మామూలు కసిగా లేరు, ఇంటర్వెల్ కి మొత్తం డబ్బు ఇచ్చేయొచ్చు. సెకండ్ హాఫ్ అంతా మీకు బోనస్ అన్నట్లు తమన్ చెప్పుకొచ్చాడు. బాలకృష్ణ గారి గురించి ఇంకా ఏం చెప్పగలను ఆయన మా నాన్న లాంటివారు ఆయన అలాంటి బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తున్నారు ప్రతిసారి. మీరందరూ నన్ను ఇంతగా మీ వాడిని అనుకుంటున్నారు అది నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే సిగ్గుతో నవ్వలేక నోరు నొప్పి వచ్చి చచ్చిపోతున్నాను. నా నోరు నొప్పిగా ఉంది, నిన్న భువనేశ్వరి గారు కూడా నందమూరి తమన్ అన్నారు.. తల కూడా దాచుకునే హుడీలు వేసుకోవాలి ఏమో అనిపిస్తుంది. ఇకమీదట ఇంకా ఎంత జాగ్రత్తగా పని చేయాలి అనేది చూస్తాను, బాలయ్య గారిని చూస్తే ఎనర్జీ వచ్చేస్తోంది. శివుడు పంపిస్తున్నాడు ఏమో నాకు తెలియదు కానీ ఆయన సినిమా అనగానే ప్రత్యేకమైన పూనకం వచ్చేస్తోంది అంటూ తమన్ చెప్పుకొచ్చాడు.