దళపతి విజయ్ కు తమిళనాడులో క్రేజ్ ఎటువంటితో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజయ్ సినిమా రిలీజ్ అంటే అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. త్వరలో చిత్ర పరిశ్రమనుండి తప్పుకోనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదిలోగా పూర్తి స్థాయి రాజాకీయాలలోకి దిగనున్నాడు విజయ్. ఈ నేపథ్యంలో సినీకెరీర్ లో చివరి సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. విజయ్ కెరీర్ లో 69వ గా రానుంది. ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు.
Also Read : VaaniKapoor : ఎట్టకేలకు హిట్ కొట్టింది.. కానీ వివాదంలో మరో సినిమా
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న జననాయగాన్ 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాకు సంబందించి ఓ క్రేజీ అప్డేట్ లీక్ అయింది. జననాయగాన్ సినిమాలో ‘తలపతి వెట్రి కొందన్’ అనే క్యారక్టర్ పేరుతో విజయ్ నటిస్తున్నాడట. ఈ పేరును షార్ట్ చేస్తే TVK పేరు వచ్చేలా ఫిక్స్ చేసాడట దర్శకుడు. అలాగే ఇదే పేరును విజయ్ చేతిమీద టాటూ కూడా ఉండబోతుందట. ఈ సినిమా తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లో అడుగుపెడుతున్న విజయ్ తన పార్టీ పేరును తన సినిమా ద్వారా మరింతగా ఆడియెన్స్ లోకి తీసుకువెళ్లబోతున్నాడనే అనుకోవాలి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమా రిలీజ్ ను భారీ ఎత్తున సెలెబ్రేట్ చేసేలా విజయ్ ఫ్యాన్స్ ఇప్పటి నుండే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈ సినిమా కోసం ఓ రాప్ సాంగ్ ను పప్లాన్ చేసాడట అనిరుధ్.