Film Federation: ఆ 20 శాతం వాటా ఇవ్వాల్సిందే.. బడా నిర్మాతలకు అల్టిమేటం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ జీవో ప్రకారం టికెట్ ధరలు పెంచుకున్న సినిమాల నుంచి సినీ కార్మికుల సంక్షేమ నిధికి రావాల్సిన 20 శాతం వాటాపై తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ తీవ్రంగా స్పందించింది. నేడు జరిగిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన నిధుల వసూలు అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన టికెట్ హైక్ జీవో ప్రకారం, పెరిగిన ధరల నుంచి వచ్చే మొత్తంలో 20 శాతాన్ని సినీ కార్మికుల వెల్ఫేర్ అకౌంట్‌కు జమ చేయాల్సి ఉంది. అయితే ఇటీవల టికెట్ ధరలు పెంచుకున్న ఐదు భారీ చిత్రాలలో కొన్ని ప్రాజెక్ట్‌లు ఈ మొత్తాన్ని ఇంకా చెల్లించలేదని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని వెల్లడించారు.
ఈ బకాయిలను వెంటనే వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నిబంధన భాషతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తుందని ఫెడరేషన్ స్పష్టం చేసింది. తెలుగు సినిమాలతో పాటు ఇక్కడ టికెట్ ధరల పెంపు ప్రయోజనాన్ని పొందిన తమిళ, కన్నడ డబ్బింగ్ చిత్రాల నిర్మాతలు కూడా ఖచ్చితంగా 20 శాతం నిధిని కార్మికుల అకౌంట్‌కు జమ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. కార్మికుల హక్కులను, సంక్షేమాన్ని కాపాడే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఫెడరేషన్ నేతలు పేర్కొన్నారు.
Also Read
- Telugu Film Federation: జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ ఊహించని షాక్.. మళ్లీ సస్పెన్షన్ వేటు!
- Ram Pothineni: అనారోగ్యంతో ఉన్న అభిమానితో హీరో రామ్ వీడియో కాల్.. భోజనం చేసి మందులు వేసుకో.. నన్ను కలవొచ్చు
- Dharman : రజనీకాంత్ ధర్మన్ సినిమాలో రామ్ పోతినేని?
- Fast Forever: 25 ఏళ్ల ప్రయాణానికి గ్రాండ్ ఫినాలే.. ‘ఫాస్ట్ ఫరెవర్’పై భారీ అప్డేట్
తాజావార్తలు
-
Film Federation: ఆ 20 శాతం వాటా ఇవ్వాల్సిందే.. బడా నిర్మాతలకు అల్టిమేటం!
-
Telugu Film Federation: జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ ఊహించని షాక్.. మళ్లీ సస్పెన్షన్ వేటు!
-
Meaning of Life: ఎందుకు పుట్టాం? ఎందుకు జీవిస్తున్నాం? జీవితానికి అసలు అర్థం ఇదేనా?
-
Pakistan: ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట.. 9 నెలల తర్వాత భార్య, సోదరిని కలిసిన మాజీ ప్రధాని..
-
Kerala: తాత హత్యకు 13 ఏళ్ల బాలిక కుట్ర.. వీడియో కాల్లో హత్యను చూస్తూ!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!