NTV Telugu Site icon

Kanguva Director Shiva : మా మంచి తెలుగు వారు…తమిళ్ వాళ్లు అలా కాదు…

Untitled Design (7)

Untitled Design (7)

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య  స్టార్ డైరెక్టర్  శివ దర్శకత్వంలో ‘కంగువ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో సూర్య వారియర్ రోల్ లో కనిపించబోతున్నాడు. కంగువ మోషన్ పోస్టర్, ఫస్ట్ టీజర్ ఆడియన్స్ లో ఈ మూవీ పై మంచి బజ్ ని క్రియేట్ చేసింది.

కాగా డైరెక్టర్ శివ కంగువ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ఛానల్ తో ముచ్చటిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలుగు సినిమా ప్రేక్షకులు తమిళ స్టార్ విజయ్, అజిత్, సూర్య, రజనీ ఇతర హీరోలను తమ వాడిగా భావిస్తారని, వైవిధ్యమైన చిత్రాలను తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తారని ప్రశంసించాడు. కానీ తమిళ ఆడియన్స్ ఇతర ఇండస్ట్రీ హీరోలని ఎప్పుడు తమ హీరోగా ట్రీట్ చేయరని అన్నారు. jr. ఎన్టీఆర్, హృతిక్ కాంబినేషన్ లో రాబోతున్నఇండియాస్ బిగ్గెస్ట్ చిత్రం వార్ -2 రికార్డులు బ్రేక్ చేస్తుందని, కల్కి బాలీవుడ్ లో విజయం సాధించడం తమకు ఎంతో  దైర్యం ఇచ్చిందని శివ తెలిపారు. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమాకు వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చి  భారీ చిత్రాలకు ఒక మార్గాన్ని చూపాడని అన్నారు శివ .

ఇదిలా ఉండగా కంగువ చిత్రం విడుదల కాకుండానే కంగువ-2 ను ప్రకటించాడు దర్శకుడు శివ.  ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని నటిస్తోంది. తమిళ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్, టాలీవుడ్ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్  సంయుక్తంగా దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. కంగువ తమిళ ఇండస్ట్రీ స్థాయిని పెంచే సినిమా అవబోతుందని, గత చిత్రాల రికార్డులను బద్దలు కొడుతుందని భావిస్తున్నారు నిర్మాతల్లో ఒకరైన జ్ఞానవేల్ రాజా.

Also Read: Jr.Ntr : దేవర నుండి అదిరిపోయే న్యూస్..ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..