Jr.Ntr : దేవర నుండి అదిరిపోయే న్యూస్..ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
- అక్టోబరు 10న దేవర మొదటి భాగం విడుదల
- వచ్చే వారంలో సెకండ్ సాంగ్ రిలీజ్
- బాలీవుడ్ నటుడితో సంప్రదింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం దేవర. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ ప్రతిపక్ష నాయకుడిగా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో రానున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
కాగా ఇటీవల దేవర నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్, ఫస్ట్ సింగిల్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ లుక్, కొరటాల టేకింగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కాగా దేవర నుండి మరొక అప్ డేట్ అందుతోంది. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ తో పాటు మరొక బాలీవుడ్ నటుడు నటించబోతున్నాడని యూనిట్ నుండి సమాచారం. ఇటీవల యానిమల్ లో క్రూరమైన ప్రతినాయకుడి పాత్రలో నటించి మెప్పించిన బాబీ డియోల్ దేవరలో నటించనున్నాడని తెలుస్తోంది. కొరటాల శివ బాబీ డియోల్ కు కథ వినిపించాడని మొదటి భాగం క్లైమాక్స్ లో బాబీ డియోల్ పాత్ర ట్విస్ట్ ఇస్తుందని, ఆ ట్విస్ట్ తో సెకండ్ పార్ట్ కు లీడ్ ఇచ్చే విధంగా కొరటాల శివ డియోల్ పాత్ర డిజైన్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని బాబీ డియోల్ నుండి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నట్టు అప్ డేట్ అందుతోంది.
Also Read
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
- MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'మైసా' రిలీజ్ డేట్ లాక్
- Kayadu Lohar: హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా కయాదును వదలని ఇండస్ట్రీ.. అసలైన పరీక్ష సెప్టెంబర్లోనే!
- Nithya Menen : నిర్మాణ రంగంపై నిత్యామీనన్ ఫోకస్
ఇదిలా ఉండగా దేవర చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జెట్ స్పీడ్ లో దేవర షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంతో పాటు బాలీవుడ్ డెబ్యూ వార్ -2లోను హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు తారక్. అనిరుధ్ సంగీతం అందిస్తున్న దేవర మొదటి భాగం అక్టోబరు 10న విడుదల చేయబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్.
Also Read: Gautham Menon: ముచ్చటగా మూడోసారి.. కానీ అక్కడ మొదటిసారి.
తాజావార్తలు
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
-
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!