Site icon NTV Telugu

Tollywood: ఫిలిం ఛాంబర్ సెక్రెటరీ చెప్పిన 13 కోట్ల హీరో ఎవరు?

Telangna

Telangna

తాజాగా, నిన్న తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కొత్త కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. దీనికి సంబంధించి కొత్త సెక్రటరీ శ్రీధర్ మీడియా ముందుకు వచ్చి కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు. అంతేకాక, ఒక హీరో గురించి ప్రస్తావిస్తూ, ఆయన చివరిగా నటించిన సినిమా థియేటర్లలో రెండు కోట్ల రూపాయలు కూడా రాబట్టలేదని, కానీ తర్వాత సినిమాకు 13 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారని ఆరోపించారు. ఆ హీరో ఎవరో కాదు, సిద్ధు జొన్నలగడ్డ అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.

Also Read:Fish Prasadam : చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశృతి

నిజానికి, ఆ సినిమాకు సిద్ధు జొననలగడ్డ నాలుగు కోట్ల రూపాయలను తిరిగి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అంతేకాక, శ్రీధర్ మాట్లాడుతూ, ప్రతి స్టార్ హీరో సంవత్సరానికి రెండు సినిమాలు చేసేవారని, ఇప్పుడు రెండేళ్లకు ఒక సినిమా చేసేందుకు మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారని చెప్పాడారు. ప్రతి నటుడు తన రెమ్యూనరేషన్‌ను హైక్ చేయడం వల్ల, రెండేళ్లకు సరిపడా ఆదాయం ఒకే సినిమాతో వస్తోందని, కాబట్టి సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని వ్యాఖ్యానించారు.

Also Read:SSMB-29 : మహేశ్-రాజమౌళి మూవీ కోసం క్రేజీ యాక్టర్..?

అంతేకాక, ఇటీవల థియేటర్ల బంద్ వ్యవహారం వెనుక ఇద్దరు నిర్మాతలు, ఇద్దరు దర్శకులు ఉన్నారని కూడా చెప్పారు. వారు పవన్ కళ్యాణ్ దగ్గరకు ఈ విషయాన్ని వేరే విధంగా తీసుకెళ్లారని ఆరోపించారు. అయితే, శ్రీధర్ మాటలపై కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్ధు జొననలగడ్డ బయటి హీరో కాబట్టి ఇలా మాట్లాడారని,, సేదైనా స్టార్ హీరో కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయితే మాట్లాడే ధైర్యం ఉంటుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version