Tamannaah: ‘కావాలయ్యా ’ సాంగ్‌లో నా డ్యాన్స్ నాకే నచ్చలేదు.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ ‘జైలర్’ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా స్టెప్పులేసిన “కావాలయ్యా” సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఈ హుక్ స్టెప్‌పై రీల్స్ చేస్తూ ఇంటర్నెట్ను షేక్ చేశారు. అయితే, తాజాగా ఈ చార్ట్‌బస్టర్ సాంగ్‌పై తమన్నా చేసిన కొన్ని వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆ పాటలో తన పెర్ఫామెన్స్ పట్ల తను పూర్తిగా సంతృప్తి చెందలేదని తమన్నా ఓపెన్ అయింది.
ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తన అఫీషియల్ యూట్యూబ్ వ్లాగ్‌లో భాగంగా తమన్నా ఇంటిని సందర్శించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య జరిగిన చిట్‌చాట్‌లో తమన్నా ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. “‘కావాలయ్యా’ సాంగ్ షూటింగ్ పూర్తయ్యాక నేను కొంత అసంతృప్తికి లోనయ్యాను. ఎందుకంటే ఆ పాటలో నేను ఇంకాస్త బెటర్‌గా డ్యాన్స్ చేసి ఉండాల్సింది అని నా మనసుకు అనిపించింది” అని తమన్నా చెప్పుకొచ్చింది. దీనిపై ఫరా ఖాన్ స్పందిస్తూ.. “నువ్వు ఎప్పుడూ ఏ పని చేసినా, ఇంకాస్త బాగా చేసి ఉండాల్సింది అని ఆలోచించే మనస్తత్వం ఉన్నదానివి” అంటూ తమన్నాను మెచ్చుకుంది.
Also Read
ఇదే ఇంటర్వ్యూలో తమన్నా తన డ్యాన్స్ ప్రాక్టీస్ గురించి మాట్లాడుతూ.. “నిజం చెప్పాలంటే నేను ప్రొఫెషనల్ గా శిక్షణ పొందిన డ్యాన్సర్‌ను కాదు. అందుకే నా తాజా హిట్ సాంగ్ ‘ఆజ్ కీ రాత్’ కోసం ఏకంగా 15 రోజుల పాటు కఠినంగా రిహార్సల్స్ చేశాను. అంత సమయం కేటాయించి పర్ఫెక్ట్గా నేర్చుకున్నాకే సెట్స్‌పైకి వెళ్లాను” అని పేర్కొంది. కాగా, అనిరుధ్ రవిచందర్ అద్భుతమైన మాస్ ట్యూన్ అందించిన ‘కావాలయ్యా’ సాంగ్ సూపర్ హిట్ అయింది.
తాజావార్తలు
-
KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
-
Asian Games 2026 Badminton: బ్యాడ్మింటన్‌లో భారత్‌కు నిరాశ.. పీవీ సింధు ఓటమితో పతకాల ఆశలు ఆవిరి
-
Ragi Health Benefits: రాగి తింటున్నా పోషకాలు అందడం లేదా? మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే కారణం!
-
Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
-
Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?