Tamannaah : తమన్నాకి ఐటెం సాంగ్స్ కూడా ఇవ్వట్లేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమన్నాకు బ్యాడ్ టైమ్, గుడ్ టైమ్ కలిసి నడుస్తోంది. జ్యోతిష్యుడు ఈ విషయాన్ని చెప్పకపోయినా, పరిస్థితులు చూస్తుంటే తమన్నా టైమ్ రెండు పడవలపై ప్రయాణిస్తోంది. హిట్ లేకపోవడం బ్యాడ్ అయితే, బాలీవుడ్ ఆఫర్స్ రావడం గుడ్ టైమ్. తమన్నాపై గ్లామర్ హీరోయిన్ ముద్ర పడినా.. ‘100% లవ్’, ‘సైరా నరసింహారెడ్డి’లలో పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. ‘F3’ తర్వాత సరైన హిట్ పడలేదు. తెలుగులో ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘భోళా శంకర్’ నిరాశపరిచింది. ఇక ‘ఓదెల 2’ లో శివశక్తిగా పవర్ఫుల్ రోల్ చేసిందని మేకర్స్ ఊదరగొట్టినా.. ‘అరుంధతి’, ‘అఖండ’లను మిక్స్ చేసి తీసిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. ‘ఓదెల 2’ తర్వాత తమన్నా తెలుగులో ఏ సినిమా చేస్తోందంటే, ఒక్కటి కూడా చేతిలో లేదు.
తమన్నా హీరోయిన్గా ఫెయిల్యూర్ అయినా, ఐటెం గర్ల్‌గా హిట్ అయింది. ‘జైలర్’ ప్రమోషన్‌కు తమన్నా ‘కావాలయ్య’ సాంగ్ ఉపయోగపడింది. ఆ తర్వాత హిందీలో 600 కోట్లకు పైగా రాబట్టిన ‘స్త్రీ 2’ లో తమన్నా ఐటెం సాంగ్ సినిమాలో స్పెషల్ గా నిలిచింది. అజయ్ దేవగణ్ మూవీ ‘రైడ్ 2’ తో మరోసారి ఐటెం గర్ల్‌గా మెరిసింది. అయితే తెలుగులో తమన్నాను స్పెషల్ సాంగ్స్‌కు కూడా పిలవడం లేదు. 16 ఏళ్ల కెరీర్లో సౌత్ లోని అన్ని భాషల్లో నటించిన తమన్నా, ప్రస్తుతం తెలుగులో ఒక్క మూవీ కూడా చేయడం లేదు. అయితే హిందీలో మాత్రం నాలుగు సినిమాలతో, తమిళంలో ఒక సినిమాతో బిజీగా ఉంది. మరి ఏడాది నుంచి రాని తెలుగు ఛాన్స్ ఎప్పుడు వస్తుందో చూడాలి మరి.
Also Read
తాజావార్తలు
-
Tamannaah : తమన్నాకి ఐటెం సాంగ్స్ కూడా ఇవ్వట్లేదా?
-
Iran Hit List: ఇరాన్ హిట్‌లిస్ట్‌లో ఆ ముగ్గురు.. పత్రికలో ప్రధాన కథనం
-
God of War: పాపం త్రివిక్రమ్.. మళ్ళీ కథ మార్చాల్సిందేనా?
-
Naga Vamsi: పైరసీకి పక్కా ప్లాన్‌తో నాగ వంశీ చెక్.. ‘లెనిన్’ విషయంలో ఏం జరిగింది?
-
Tollywood : సింగిల్ థియేటర్స్ మూత పడడానికి స్టార్ హీరోలే కారణమా?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!