హీరోయిన్ తాప్సీ పన్ను.. హిట్ ఫట్ విషయం పక్కన పెడితే నటిగా మంచి గుర్తింపు మాత్రం సంపాదించుకుంది. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈ సొట్టబుగ్గల చిన్నది ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్ హీరోయిన్‌గా పరిచయమై, ఆ తర్వాత తెలుగు, తమిళంలో వరుస చిత్రాల్లో నటించింది. ‘వస్తాడు నా రాజు’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘సాహసం’, ‘ఆనందో బ్రహ్మ’, ‘మొగుడు’ లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించగా, అలాగే తమిళ్‌లో ‘కాంచన 2’, ‘వై రాజా వై’, ‘గేమ్ ఓవర్ సహా’ ఇలా చాలా చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత కొంత అవకాశాలు తగ్గడంతో తాప్సీ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి ‘మిషన్ మంగళ్’, ‘చాంత్ కి ఆంక్’, ‘తప్పట్’, ‘హసీన్ దిల్రూబా’ వంటి మూవీస్ లో నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనే వరుస సినిమాలు సిరీస్ చేస్తోంది. ఇక తాజాగా తాప్సీ తన గొప్ప మనసు చాటుకుంది..
Also Read: Comedian : ప్రముఖ కమెడియన్ మృతి
వేసవి కాలం మొదలైంది. దాదాపు అందరు ఏసీ,కూలర్‌లు లెకుండా ఉండటంలేదు. కానీ ఈ ఎండలకు పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి తాప్సీ సహాయం అందించింది. ఓ ప్రముఖ స్వచ్ఛంద సంస్థతో కలిసి, రేకుల షెడ్డులో నివాసముంటున్న పేదలకు ఫ్యాన్లు, కూలర్లు అందించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ తాప్సీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అందమైన నటి మాత్రమే కాదు అందమైన మనసున్న మనిషి అంటూ పొగుడుతున్నారు.