బాలీవుడ్ బ్యూటీ తాప్సి పన్ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సొట్ట బుగ్గల సుందరి తన సినీ కెరీర్ తెలుగు సినిమాతోనే మొదలు పెట్టింది.మంచు మనోజ్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన “ఝుమ్మంది నాదం”.సినిమాతో ఈ భామ టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయింది.ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయిన తన గ్లామర్ తో తాప్సి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తరువాత తెలుగు మరియు తమిళ్ లో ఈ భామ వరుస సినిమాలు చేసి ఎంతగానో ఆకట్టుకుంది.సౌత్ లో ఈ భామ కేవలం గ్లామర్ పాత్రలతో అలరించింది.సౌత్ లో సరైన అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కి వచ్చింది . ప్రస్తుతం విభిన్న పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నది.బాలీవుడ్ బడా స్టార్స్ సరసన ఈ భామ అవకాశాలు అందుకుంటుంది.
గత ఏడాది షారుఖ్ ఖాన్, తాప్సి నటించిన ‘డంకీ’ సినిమా రిలీజ్ అయింది.కానీ ఆ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు..కానీ ఆ సినిమాలో తాప్సి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం తాప్సి ‘ఓ లడ్‌కీ హై కహా’, ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా’ మరియు ‘ఖేల్ ఖేల్ మే’ వంటి సినిమాల్లో నటిస్తున్నది.తాను సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 14 ఏళ్ళు గడిచాయని ఆమె తెలిపింది.హీరోయిన్ గా ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఇంత దూరం వచ్చాను. నా కష్టానికి తగిన ఫలితం దక్కిందని అనుకుంటున్నానని ఆమె తెలిపింది. అందుకే ఎంతో సంతోషంగా ఉన్నట్లు తాప్సి తెలిపింది .ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న తాప్సి దక్షిణాది చిత్రాల్లో మంచి అవకాశాలు వస్తే నటించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపింది.తాప్సి అప్పట్లో సౌత్ సినిమాల మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా రాఘవేంద్రరావు గురించి చేసిన వ్యాఖ్యల మీద పెను దుమారమే రేగింది. అన్నేసి మాటలని ఇప్పుడు మళ్లీ సౌత్ సినిమాల్లో అవకాశం వస్తే నటిస్తాను అని ఎలా అంటున్నావు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.