టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి వెళ్ళిన హీరోయిన్‌లలో తాప్సీ ఒకరు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత 15 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తోంది. నార్మల్‌గా తెలుగులో ఆఫర్ లు తగ్గితే ప్రతి ఒక్కరు చేసే పని.. వేరే ఇండస్ట్రీలోకి వెలడం. తాప్సీ కూడా అదే చేసింది. ప్రజంట్ బాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ అందుకున్న తాప్సీ పన్నూ.. ఇటు వరుస చిత్రాల్లో నటిస్తూ, ప్రొడ్యూసర్‌గా పలు సినిమాలు కూడా నిర్మిస్తోంది. ప్రస్తుతం ‘వో లడ్కీ హై కహా’, ‘గాంధారి’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఇక కెరీర్ పరంగా ఎంత ప్లాన్నింగ్‌తో ఉంటుందో.. తనపై వచ్చిన ట్రోల్స్ పై కూడా తనదైన శైలిలో స్పందిస్తుంది తాప్సీ. ఇందులో భాగంగా రీసెంట్ గా కంగనా రనౌత్ సోదరి రంగోలీ గతంలో తనపై చేసిన విమర్శలపై తాజాగా రియాక్ట్ అయింది.
Also Read: Sumanth: అక్కినేని సుమంత్ ‘అనగనగా’.. టీజర్
తాప్సీ మాట్లాడుతూ.. ‘మనం మాట్లాడే మాటలు మన పెంపకాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. నేను కంగనా రనౌత్ లాగా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోకపోవడం వల్ల కాపీ అయి ఉండవచ్చు. అలాంటి టాలెంటెడ్ యాక్ట్రెస్‌ని నేను కాపీ కొట్టానని అంటే కనుక నేను దాన్ని సంతోషంగా అంగీకరిస్తాను. కష్టపడి తన సొంత ప్రయాణాన్ని ఏర్పరచుకున్న ఏ స్త్రీ గురించి నేను ఎప్పుడూ తప్పుగా మాట్లాడను అది గుర్తు పెట్టుకుంటే మంచిది’ అంటూ తాప్సీ తెలిపింది. అయితే ఈ గొడవ ఇప్పుడు జరిగింది కాదు. 2019 లో జరిగింది. దానికి రీసెంట్ గా తాప్సీ ఇప్పుడు స్పందించింది.