Syed Sohel Ryan Speech at Bootcut Balaraju Pre Release Event: ‘బిగ్‌బాస్’ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్ లో శ్రీ కోనేటి దర్శకత్వంలో గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్ పై ఎం.డీ పాషా నిర్మిస్తున్న సినిమా బూట్ కట్ బాలరాజు. మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘బూట్ కట్ బాలరాజు’ ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, హీరోలు సందీప్ కిషన్, మంచు మనోజ్, రోషన్ కనకాల, దర్శకులు శ్రీకాంత్ ఓదెల, సాయి రాజేష్ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సోహెల్ మాట్లాడుతూ.. పాషా లాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం, ఆయన మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చారు. సినిమా అంటే ప్యాషన్ తో చాలా హార్డ్ వర్క్ చేసి సినిమాని నిర్మించారు. ఈ సినిమా నిర్మాణం యాభై శాతం పూర్తయిన తర్వాత ఫైనాన్సియల్ గా కొంత ఇబ్బంది ఎదురవ్వడంతో నిర్మాత కాస్త ఒత్తిడికి లోనయ్యారు, ఆయన్ని ఒత్తిడి తీసుకోవద్దని చెప్పా.
Apoorva Rao: టాలీవుడ్ కి పరిచయమవుతున్న ఒంగోలు పిల్ల ‘అపూర్వ’
అప్పుడే నాన్న రిటైర్మెంట్ పైసలు, నేను సంపాదించిన పైసలు, ఇల్లు కొనుక్కుందామని ఉంచుకున్నవి అన్నీ ఈ సినిమాకు పెట్టా. ఈ సినిమాతో నిర్మాతల కష్టాలు మరింత అర్థమయ్యాయి. నిర్మాత దిల్ రాజుకి మా పరిస్థితి చెప్పగా ఆయన చాలా గొప్ప మనసుతో నైజాం నేను చూసుకుంటా, మీరు ఒత్తిడి తీసుకోవద్దని చెప్పారు. ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వేడుకకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన వారందరికీ కృతజ్ఞతలు. బిగ్ బాస్ లో వునప్పుడు నా ఒరిజినాలిటీ చూసి ప్రేక్షకులు ప్రోత్సహించారు. బూట్ కట్ బాలరాజుని కూడా అలానే థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారు, సినిమాకి వెళ్ళండి చాలా ఫన్ ఎమోషన్ ఉంటుంది. ఇందులో చాలా మంచి డ్యాన్స్ కూడా చేశాను. మనం జీవితంలో ఓడిన గెలిచినా ఒక తల్లికి కొడుకు మీద ప్రేమ పోదు. అదే ఈ సినిమాలో అద్భుతంగా చూపించామన్నారు. . ఫిబ్రవరి 2న థియేటర్స్ లో బూట్ కట్ బాలరాజు సినిమా చూడాలి నా దగ్గర పైసల్లేవు పబ్లిసిటీకి. దయ చేసి నా సినిమా చూడండి… అంటూ మోకాళ్ళపై పడి ప్రేక్షకులను అర్దించారు సోహైల్.