Happy Ending Movie Heroine Apoorva Rao Interview: యంగ్ హీరో యష్ పూరి హీరోగా నటించిన “హ్యాపీ ఎండింగ్” సినిమాలో అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ బ్యానర్ల మీద సంయుక్తంగా యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలుగా నిర్మించారు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించిన ఈ “హ్యాపీ ఎండింగ్” సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సందర్భంగా సినిమా హైలైట్స్ ను లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపింది తెలుగమ్మాయి, హీరోయిన్ అపూర్వ రావ్. తమ నేటివ్ ప్లేస్ ఒంగోలని, నాన్న ఉద్యోగరీత్యా ఫ్యామిలీ గుజరాత్ షిప్ట్ అయ్యామని అన్నారు. చైల్డ్ హుడ్ గుజరాత్ లో, కువైట్ లో జరగగా ఇండియా తిరిగి వచ్చి గ్రాడ్యుయేషన్ చేసి కొంత కాలం జాబ్స్ చేశానని అన్నారు. జాబ్స్ ఏవీ నాకు సంతృప్తినివ్వలేదని, సినిమాల మీద ఆసక్తి ఉన్నా పేరెంట్స్, ఫ్రెండ్స్ ఎవరూ ఎంకరేజ్ చేసేవారు కాదన్నారు.
Nani: దేవర రాకపోతే డేట్ కబ్జా… మరి పుష్పరాజ్ ని మరిచిపోయారా?
కొన్నాళ్లకు యాక్టింగ్ వైపు రావాలని నిర్ణయించుకుని హైదారాబాద్ లో దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం స్కూల్ లో జాయిన్ అయి ట్రైనింగ్ తీసుకోగా ఆ టైమ్ లో పరిచయమైన కొందరు అసిస్టెంట్ డైరెక్టర్స్, వారి కామన్ ఫ్రెండ్స్ ద్వారా “హ్యాపీ ఎండింగ్” సినిమా ఆడిషన్స్ కు వెళ్లానని అన్నారు. తెలుగు బాగా మాట్లాడే అమ్మాయి కావాలి, బాగా పర్ ఫార్మ్ చేయాలి అనేది వాళ్ల రిక్వైర్ మెంట్ కాగా నేను చేసిన ఆడిషన్ వాళ్లకు నచ్చి ఈ మూవీలో హీరోయిన్ గా తీసుకున్నారన్నారు. “హ్యాపీ ఎండింగ్” సినిమాకు యూత్ పుల్ మూవీ అనే పేరు వచ్చింది కానీ సినిమాలో చాలా హ్యూమర్, ఫన్ ఉంటాయని ఆమె అన్నారు. ప్రతి పది నిమిషాలకు బాగా నవ్వుకుంటారని, మాకు ఆ విషయం తెలుసుకాబట్టి బయట సినిమా మీద ఎలాంటి ఇంప్రెషన్ ఉన్నా…టెన్షన్ పడటం లేదన్నారు. సినిమాలో హీరోకు ఒక ప్రాబ్లమ్ ఉంటుంది, దాని వల్ల ఆయన చేయాలనుకున్న పనులు చేయలేకపోతాడు. ఈ కాన్ ఫ్లిక్ట్ ను హీరో ఎలా ఎదుర్కొన్నాడు, అందుకు అతను చేసే ప్రయత్నాలు హ్యూమరస్ గా ఉంటాయన్నారు. ఈ మూవీ చూసిన వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తారు, ఎంటర్ టైన్ అవుతారని ఆమె అన్నారు.