ఏడేళ్ళ క్రితమే ఇంజనీరింగ్ గ్యాడ్యుయేషన్ పూర్తి చేసి నటనను కెరీర్ గా ఎంచుకుంది శ్వేత వర్మ. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించి, 2016లో ‘లవ్ చేయాలా వద్దా’ మూవీలో కీలక పాత్రను పోషించింది. ఆ తర్వాత ‘మిఠాయి, సంజీవని, రాణి’ వంటి చిత్రాలలో నటించింది. ‘బియాండ్ బ్రేకప్’ వంటి వెబ్ సీరిస్ లోనూ నటించి, చక్కని గుర్తింపు తెచ్చుకున్న శ్వేత వర్మకు కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఓ డబుల్ ధమాకా దక్కబోతోంది.
శ్వేత వర్మ నటించిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. ఆగస్ట్ 6న రాబోతున్న ‘మ్యాడ్’ మూవీలో శ్వేత వర్మ హీరోయిన్ గా నటించింది. అలానే ‘ముగ్గురు మొనగాళ్ళు’ చిత్రంలో హీరో శ్రీనివాసరెడ్డి లవ్ ఇంట్రస్ట్ గానూ శ్వేత వర్మ కీ-రోల్ ప్లే చేసింది. ‘మ్యాడ్’లో సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే అఖిల పాత్రను ఆమె పోషించింది. లివ్ ఇన్ రిలేషన్ సాగించే అఖిల, అరవింద్ పాత్రలను శ్వేత వర్మ, రజిత్ రాఘవ్ పోషించారు. ట్రైలర్ లో ఈ జంట కనిపించిన తీరు చూస్తే కుర్రకారుని కిర్రెక్కించే సన్నివేశాలు ‘మ్యాడ్’లో బాగానే ఉన్నాయనిపిస్తోంది. ‘మ్యాడ్’, ‘ముగ్గురు మొనగాళ్ళు’ సినిమాలు ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యంగా జనం ముందుకు వస్తున్నాయి. ‘మ్యాడ్’ సినిమాలో అందాలు ఆరబోసిన శ్వేత వర్మకు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.