Swayambhu: ‘స్వయంభు’పై నిఖిల్ అదిరిపోయే అప్డేట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swayambhu: ‘కార్తికేయ 2’తో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ హీరో నిఖిల్, ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘స్వయంభు’తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒక పీరియాడిక్ యోధుడి కథతో, అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి నిఖిల్ స్వయంగా సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఈ సినిమా గ్రాఫిక్స్ పనులను ఫాంటమ్ ఎఫ్ఎక్స్ టీమ్ చేస్తోంది. తాజాగా వాళ్లు రెడీ చేసిన కొన్ని సీన్లను చూసిన నిఖిల్‌కు సంతోషం వేసిందట. ఆ విజువల్స్ చూసి ఆయనకు మాటలు రాలేదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని ఎక్స్ వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. “ఇప్పుడే ‘స్వయంభు’ వీఎఫ్ఎక్స్ షాట్స్ కొన్ని చూశాను. ఫాంటమ్ ఎఫ్ఎక్స్ వాళ్లు మామూలుగా చేయలేదు.. అవుట్‌పుట్ చూసి నాకైతే మైండ్ బ్లాంక్ అయింది. ఇంత పెద్ద సినిమాను ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్‌పై చూస్తానా అని అస్సలు ఆగలేకపోతున్నా. థియేటర్లలో మీకు ఒక రేంజ్ విజువల్ ట్రీట్ పక్కా. ఈ ఏడాదే సినిమాతో వచ్చేస్తున్నాం” అంటూ టీమ్ మొత్తాన్ని ట్యాగ్ చేస్తూ నిఖిల్ పోస్ట్ పెట్టారు.
Also Read
ఈ సినిమాలో నిఖిల్ మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్ఫుల్ యోధుడిగా కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన గుర్రపు స్వారీ, మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఠాగూర్ మధు, బిజోయ్ రాజ్ ఎక్కడా తగ్గకుండా నిర్మిస్తున్నారు. పీరియాడిక్ సినిమాలకు గ్రాఫిక్స్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఇప్పుడు నిఖిల్ స్వయంగా వీఎఫ్ఎక్స్ అదిరిపోయిందని చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పీక్స్‌కు చేరాయి.
Just saw some Vfx shots of #Swayambhu
@phantomfx_india have done a Fantastic Job for the movie .. cant wait for the entire film on this BIG SCREEN this Year..
You are all in for an Amazing Experience .
looking fwd to delivering this Magnus Opus on screens…
@bejoyraj bhai…. @krishbharat20 @TagoreMadhu— Nikhil Siddhartha (@actor_Nikhil) October 25, 2026
తాజావార్తలు
-
Swayambhu: ‘స్వయంభు’పై నిఖిల్ అదిరిపోయే అప్డేట్!
-
Tummala Nageswara Rao : గోదావరిలో నీళ్లు ఖతం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
-
Bengaluru IT Jobs: బెంగళూరులో ఉద్యోగాలు తెలుగు, తమిళులకేనా? యువతి ఆరోపణలపై సీఎం వార్నింగ్!
-
Inter Board: 3,241 కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు.. వాటిపై క్లారిటీ
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
ట్రెండింగ్
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!