స్టార్ హీరో సూర్య గురించి పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్ నటుడు శివ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చి ఆనతి కాలంలోనే అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సూర్య ఏ పాత్ర చేసిన అందులో ఒదిగిపోతాడు. అందుకే అతను ఒప్పుకున్న సినిమాలకి మినిమం గ్యారెంటీ ఉంటుంది. సూర్య తమిళ స్టార్ అయినప్పటికి తెలుగులోను విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే సూర్య నటించిన ప్రతి ఒక్క మూవీ తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు. ఇక చివరగా ‘కంగువ’ మూవీ తో అలరించిన సూర్య ప్రజంట్ వరుస సినిమాలు లైన్ పెట్టాడు.
Also Read:Vaishnavi : పార్క్‌లో బట్టలు మార్చుకునే రోజు నుండి క్యారవన్ వరకు..
అందులో వెంకీ అట్లూరి కలయికలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఈ సినిమాకు సూర్య డేట్స్ ఇచ్చాడని తెలుస్తోంది. ఐతే, ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో చాలా వార్తలు పుట్టుకొచ్చాయి. మేకర్స్ మొదట భాగ్యశ్రీ భోర్సే ను తీసుకునే ప్లాన్‌లో ఉన్నారని తెలుపగా, ఆ తర్వాత మరో హీరోయిన్ ‘కాయదు లోహర్’ పేరు వినపడింది. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ పేరు కూడా వినపడుతుంది. ఆ గ్లామరస్ బ్యూటీ ఎవరో కాదు సంయుక్త మీనన్. ఈ అమ్మడు అనతి కాలంలోనే వరుస హిట్ లు అందుకుని లక్కి చామ్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు సూర్య మూవీలో నటించబోతున్నట్లు సమాచారం. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.