Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suriya: తమిళ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతున్న కొత్త మూవీకి టైటిల్, రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. మలయాళ దర్శకుడు జితు మాధవన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘సీన్’ (Scene) అనే టైటిల్‌ను మేకర్స్ పెట్టారు. ఈ చిత్రంలో నజ్రియా హీరోయిన్ నటిస్తుండగా.. నస్లెన్, ఆనంద్‌రాజ్, లాల్, రాజ్ ప్రియన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమాను దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తుంది. నవంబర్ 6, 2026 న ఈ మూవీ థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతుందని అధికారికంగా ప్రకటించారు.
ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతిక కలిసి తమ 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇక జితు మాధవన్ విషయానికి వస్తే.. ఆయన గతంలో ‘రోమాంచం’, ‘ఆవేశం’ వంటి సక్సెస్ఫుల్ మలయాళ మూవీస్‌కి దర్శకత్వం వహించారు. ‘ఆవేశం’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు సూర్యతో కలిసి తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. సూర్య, జితు మాధవన్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో సూర్యను భిన్నమైన పాత్రలో చూపించనున్నారనే వార్తలు మూవీపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఆయన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆయన నటిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సింగం, సింగం 2, సింగం 3 తర్వాత సూర్య నటిస్తున్న పోలీసు సినిమాగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
- Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
- Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు ఎందుకు?
తాజావార్తలు
-
Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
-
Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
-
Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!