Suriya Scene: సూర్య ‘సీన్’ సినిమా కాపీనా.. డిట్టో దింపేశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్న సూర్య, జిత్తు మాధవన్ కాంబినేషన్ చిత్రం ‘సీన్’ ఇప్పుడు ఒక ఊహించని వివాదంలో చిక్కుకుంది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ఈ కథపై సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నా, థియేట్రికల్ రన్ ఒక కొలిక్కి వచ్చేవరకు సినీ విశ్లేషకులు వేచి చూశారు. ఇప్పుడు అసలు విషయం బయటకు రావడంతో కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. 2013లో జానీ టో దర్శకత్వంలో వచ్చిన హాంకాంగ్ క్రైమ్ థ్రిల్లర్ ‘బ్లైండ్ డిటెక్టివ్’ సినిమాకు ‘సీన్’ దాదాపు నకలు అన్నట్లుగా ఉందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
సెకండాఫ్‌లో దర్శకుడు జిత్తు మాధవన్ తనదైన శైలి కామెడీ, విచిత్రమైన పాత్రలతో కథను మలుపు తిప్పినప్పటికీ, సినిమా మూలకథ మొత్తం ‘బ్లైండ్ డిటెక్టివ్’ నుంచే తీసుకున్నారనేది ప్రధాన ఆరోపణ. కేవలం కళ్ళు కనిపించని డిటెక్టివ్ అనే పాయింట్ మాత్రమే కాకుండా, కొన్ని కీలక సన్నివేశాలను యథాతథంగా దించేశారని నెటిజన్లు ఆధారాలతో సహా పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా మార్చురీ సన్నివేశాలు, మిస్ అయిన అమ్మాయి మృతదేహాన్ని ఉంచిన తీరు చూస్తుంటే.. పాత సినిమా డీవీడీని పెట్టి మక్కీకి మక్కీ రీ-షూట్ చేసినట్లుగా ఉందంటూ సినీ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read
- Aditya Dhar: రణ్వీర్ సింగ్‌తోనే ఆదిత్య ధర్ మూవీ.. ఈసారి మరో డ్రీమ్ ప్రాజెక్ట్!
- Nasha MuktBharat: డ్రగ్స్ మహమ్మారిపై సమరశంఖం.. 'నషా ముక్త్ భారత్ యాత్ర'కు కింగ్ నాగార్జున మద్దతు..
- January 12 Vidudala: ప్రమోషన్స్ అంటే చాలు వచ్చేస్తాడు.. అనిల్ రావిపూడిపై కృతి, కీర్తి సెటైర్లు!
- Swasika: ఆమె నటిస్తే మూవీ హిట్టే.. 'ఏవోటీ'తో హ్యాట్రిక్ సాధిస్తుందా?
‘బ్లైండ్ డిటెక్టివ్’లో ఆండీ లా పోషించిన జాన్స్టన్ చోంగ్ పాత్ర విధి నిర్వహణలో చూపు కోల్పోయి రిటైర్ అవుతాడు. ‘సీన్’ చిత్రంలో సూర్య పోషించిన డీఎస్పీ ఇన్బరాజ్ పాత్ర కూడా 90 శాతం చూపు కోల్పోయిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. చూపు లేకపోయినా కేవలం వినికిడి శక్తి, పదునైన జ్ఞాపకశక్తి, మొండి పట్టుదలతో కేసులను ఛేదించడంలో ఇద్దరూ ఒకేలా ప్రవర్తిస్తారు. చూపు లేని హీరో ఒంటరిగా ఇన్వెస్టిగేషన్ చేయలేడు కాబట్టి అతనికి ఒక సహాయకురాలు ఉంటుంది. ఒరిజినల్ సినిమాలో సామీ చెంగ్ (గోల్డీ హో) హీరోకు కళ్ళుగా మారి క్రైమ్ సీన్లలో నడిపిస్తుంది. ఇక్కడ నజ్రియా నజీమ్ పోషించిన ‘మాయ’ పాత్ర కూడా సరిగ్గా అదే పనిచేస్తుంది. ఇన్బరాజ్కు చూపు లేదనే విషయం పైఅధికారులకు తెలియకుండా కవర్ చేస్తూ, గ్రౌండ్ లెవల్లో అతనికి కళ్ళుగా మారుతుంది. క్లైమాక్స్‌లో జిత్తు మాధవన్ తన మార్క్ ట్విస్టులు ఇచ్చినా, ప్రధాన పాత్రల రూపకల్పన, కథ నడిచే తీరు మాత్రం ‘బ్లైండ్ డిటెక్టివ్’ ఛాయల నుంచి బయటపడలేకపోయింది. ఎలాంటి అధికారిక రీమేక్ హక్కులు లేకుండా ఇలా విదేశీ చిత్రాల కథలను స్ఫూర్తి పేరుతో వాడుకోవడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
తాజావార్తలు
-
Suriya Scene: సూర్య ‘సీన్’ సినిమా కాపీనా.. డిట్టో దింపేశారా?
-
Sonakshi Sinha: ‘‘రాజీవ్ ఒడిలో సోనియా’’.. రాహుల్ గాంధీకి సోనాక్షి సిన్హా మద్దతు!
-
Aura Kid: ‘ఆరా కిడ్’గా ఫేమస్ అయిన రెండేళ్ల బుడతడు.. 139M వ్యూస్‌తో ఇన్‌స్టాను షేక్ చేస్తున్న వీడియో..
-
Henry Nicholls: భారత్‌పై పోరాటం.. భార్య పుట్టినరోజునే సెంచరీ.. హెన్రీ నికోల్స్ ఎమోషనల్ కామెంట్స్!
-
Yashasvi Jaiswal: కేకేఆర్ కొత్త కెప్టెన్‌గా యశస్వి జైస్వాల్..? ఆ డీల్ కుదరాలంటే ఉన్న పెద్ద చిక్కు ఇదే..
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!