అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక మల్టీ లాంగ్వేజ్ మూవీ ‘త్రిముఖ’, దసరా పండుగ సందర్భంగా కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించింది. ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. యూనిట్ వెల్లడించిన ప్రకారం సినిమా షూట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్నాయి. ఈ సినిమా 2025 డిసెంబర్ మొదటి వారంలో దేశవ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read :Hebba Patel : హెబ్బా పటేల్ ఏంటి ఇలా తయారైయింది!
ఈ చిత్రంలో సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆమెతో పాటు యోగేష్ కల్లే, ఆకృతి అగర్వాల్, CID ఆదిత్య శ్రీవాస్తవ, ప్రవీణ్, శకలక శంకర్, ముట్టా రాజేంద్రన్, ఆశూ రెడ్డి, సుమన్, రవి ప్రకాష్, సహితి, సూర్య, జీవ, జెమినీ సురేష్ తదితరులు నటిస్తున్నారు. నిర్మాతలు రమేష్ మద్దాలి – శ్రీదేవి మద్దాలి మాట్లాడుతూ “‘త్రిముఖ’ అద్భుతమైన స్థాయిలో తెరకెక్కింది. మా నటీనటుల ప్రతిభ, దర్శకుడి విజన్, సాంకేతిక బృందం కృషి – ప్రతి ఫ్రేమ్ అంచనాలకు మించి ఉంది. ఈ డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందనే మాకు పూర్తి నమ్మకం ఉంది.” అన్నారు.