Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sigma Telugu Release: సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ హీస్ట్ థ్రిల్లర్ ‘సిగ్మా’ టీజర్, పాటలు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు సంబంధించిన కీలక అప్డేట్ బయటకు వచ్చింది. తమిళ నాడు ముఖ్యమంత్రి తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు రంగంలోకి దిగాయి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ‘సిగ్మా’ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. జూలై 31న రావాల్సిన సినిమా కొన్ని కారణాలతో వాయిదా పడగా.. ఇప్పుడు గాంధీ జయంతి వీకెండ్‌ను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 2న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఆఫీషియల్ గా ప్రకటించారు. హై స్టేక్స్ హీస్ట్, యాక్షన్, అడ్వెంచర్, ట్రెజర్ హంట్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కినట్లు ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా క్లారిటీ వచ్చింది.
ఇక తెలుగు మార్కెట్లో ‘సిగ్మా’కు మంచి థియేట్రికల్ సెటప్ లభించింది. కోస్తా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల పంపిణీ హక్కులను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ దక్కించుకుంది. సీడెడ్ ప్రాంతంలో ఎన్వీఆర్ సినిమా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ‘సిగ్మా’ ను భారీగానే రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కారణంగా ‘సిగ్మా’కు థియేటర్ స్పేస్ కూడా లభించే అవకాశం ఉంది. మరోవైపు సీడెడ్‌లో ఎన్వీఆర్ సినిమా పంపిణీ చేయడంతో అక్కడ కూడా సినిమాకు మంచి థియేట్రికల్ రీచ్ దక్కనుంది. ‘సిగ్మా’తో జాసన్ సంజయ్ దర్శకుడిగా తన తొలి అడుగు వేస్తున్నారు. తమిళ స్టార్ విజయ్ కుమారుడిగా ఇప్పటికే ప్రేక్షకుల్లో గుర్తింపు ఉన్న ఆయన.. తన మొదటి సినిమాకే హీస్ట్ యాక్షన్ అడ్వెంచర్ కథను ఎంచుకోవడం విశేషం.
Also Read
ఇందులో హీరోగా సందీప్ కిషన్, హీరోయిన్గా ఫరియా అబ్దుల్లా నటిస్తుండగా.. రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు థాసన్, యోగ్ జపీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన రావడంతో మ్యూజిక్ పరంగానూ సినిమాపై హైప్ పెరిగింది. టీజర్లో కనిపించిన యాక్షన్ విజువల్స్, సందీప్ కిషన్ స్టైలిష్ లుక్, జాసన్ సంజయ్ డైరెక్షన్ డెబ్యూ.. ఇవన్నీ కలిసి ‘సిగ్మా’పై ప్రత్యేక బజ్ ను పెంచుతున్నాయి. అక్టోబర్ 2న తమిళంతో పాటు తెలుగులోనూ ‘సిగ్మా’ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్యంగా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్, ఎన్వీఆర్ సినిమా వంటి సంస్థలు తెలుగు రాష్ట్రాల పంపిణీ బాధ్యతలు తీసుకోవడంతో సినిమాకు థియేట్రికల్‌గా మంచి రీచ్ లభించే అవకాశం కనిపిస్తోంది.
- Tags
- cinema
- Sundeep Kishan
తాజావార్తలు
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
-
ChiranjeeviOdela : ‘ప్యారడైజ్’ రిజల్ట్‌పైనే చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!