Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Sumaya Reddy Comments At Dear Uma Pre Relesae Event

Sumaya Reddy: “మీ కోసం మీరు నిలబడకపోతే, ఎవరూ నిలబడరు!

Published Date :April 17, 2025 , 11:32 am
By Bhargav Chaganti
Sumaya Reddy: “మీ కోసం మీరు నిలబడకపోతే, ఎవరూ నిలబడరు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలుగమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా రూపొందించిన చిత్రం ‘డియర్ ఉమ’ ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ కథానాయకుడిగా నటించారు. సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట కెమెరామెన్‌గా, బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సంగీతం అందించిన రదన్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. నగేష్ లైన్ ప్రొడ్యూసర్‌గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.

ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సుమయ రెడ్డి మాట్లాడుతూ, “అనంతపూర్ నుంచి వచ్చిన నేను ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉంది. మా ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మీడియా నిలిచింది. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు సపోర్ట్ చేసిన మీడియాకు ధన్యవాదాలు. తెలుగమ్మాయిలు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎక్కువగా వస్తున్నారు. నేను ఒక అడుగు ముందుకేసి ఈ సినిమాను నిర్మించాను. అందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను,” అని అన్నారు.

“నేను రాసి, తీసిన షార్ట్ ఫిల్మ్‌కు మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత సాయి రాజేష్‌తో కలిసి ‘డియర్ ఉమ’ చేశాం. నాకు అండగా నిలిచిన మధు, చక్రవర్తులకు ధన్యవాదాలు. నవీన్ గారి సహకారంతోనే రదన్ గారు మా ప్రాజెక్టులో చేరారు. ప్రతి ఒక్కరూ తమ డ్రీమ్ ప్రాజెక్ట్‌లా ఈ సినిమా కోసం కష్టపడ్డారు. ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉన్నట్లే, ప్రతి అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయి ఉంటాడు. నగేష్ ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి నాతో ఉన్నారు,” అని సుమయ రెడ్డి వివరించారు. “మీ కోసం మీరు నిలబడకపోతే, మీ కోసం ఎవరూ నిలబడరు. ఎంతో కష్టపడి ఈ సినిమాను ఇక్కడి వరకు తీసుకొచ్చాం. ఏప్రిల్ 18న ‘డియర్ ఉమ’ థియేటర్లలో విడుదల కానుంది. అందరూ చూసి మా చిత్రాన్ని విజయవంతం చేయండి,” అని అభిమానులను కోరారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dear Uma Pre Relesae Event
  • Sumaya Reddy Comments

తాజావార్తలు

  • Chanakya Niti: డబ్బు గురించి చాణక్యుడు చెప్పిన సంచలన నిజాలు.. ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి మీ వైపు కన్నెత్తి కూడా చూడదు!

  • Charlapalli Su*ici*de case: చర్లపల్లిలో తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. ప్రాణహాని ఉందంటూ పీఎస్‌కు విజయారెడ్డి భర్త..

  • Bharatavarsha: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న గోపీచంద్ ‘భరతవర్ష’.. టైటిల్ గ్లింప్స్!

  • Mahesh Kumar Goud: బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదు.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పోటీ లేదు!

  • AI Technology in Tamil Nadu Election Campaign: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఏఐ టెక్నాలజీ.. ఐడియా భలే ఉందే..

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions