Sukumar Universe: సుకుమార్ యూనివర్స్‌లో ఆరు సినిమాలు.. ఆరు షాకింగ్ జానర్లు! టాలీవుడ్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sukumar Universe: టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియాల లెవల్లో తనదైన మేకింగ్, స్టోరీ, స్క్రీన్‌ప్లేతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ సుకుమార్. ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్ ఒక ఆసక్తికరమైన ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఒకే తరహా కథలకు పరిమితం కాకుండా.. విభిన్న జానర్లలో ఫ్రెష్ కాన్సెప్ట్స్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసే దిశగా ఆయన కొత్త అడుగులు వేస్తున్నారని సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏకంగా ఆరు సినిమాలను సుకుమార్ లైన్లో పెట్టినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులన్నింటికీ ఒక కామన్ పాయింట్ ఉంది. ఆరు సినిమాలకు ఆరుగురు వేర్వేరు డైరెక్టర్స్ దర్శకత్వం వహించనుండగా.. వాటి వెనుక సుకుమార్ రైటింగ్, కథనం, స్క్రీన్‌ప్లే ప్రధాన బలంగా ఉండనుందని తెలుస్తోంది. అంటే కథలు వేరు.. ఆరుగురు దర్శకులు వేరు.. జానర్లు వేరు.. కానీ క్రియేటివ్ ఫోర్స్ మాత్రం సుకుమార్ అన్నమాట. ఇప్పటికే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ద్వారా పలు విభిన్నమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు లెక్కల మాస్టర్. కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ.. కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చే సినిమాలను రూపొందించడంపై ఆయన ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే ఫార్ములాను మరింత పెద్ద స్థాయిలో అమలు చేయబోతున్నారని టాక్.
ఈ ఆరు సినిమాలు ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా.. పూర్తిగా భిన్నమైన కథలు, ప్రపంచాలతో తెరకెక్కనున్నట్లు సమాచారం. కామెడీ, థ్రిల్లర్, యాక్షన్, ఎమోషనల్ డ్రామా, లవ్ స్టోరీ వంటి విభిన్న జానర్లను ఈ ప్రాజెక్టులు టచ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దర్శకులు, హీరోలు, కథలు తదితర పూర్తి వివరాలు మాత్రం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ముఖ్యంగా కొత్త ఆలోచనలు, ఫ్రెష్ కాన్సెప్ట్స్‌తో వస్తున్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న సమయంలో సుకుమార్ చేస్తున్న ఈ కొత్త ప్రయోగం టాలీవుడ్లో ఆసక్తిని పెంచుతోంది. ఆరుగురు దర్శకులకు అవకాశం ఇవ్వడంతో పాటు.. తన రైటింగ్‌తో వారికి బలమైన కథలను అందించడం ద్వారా కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సుకుమార్ ‘RC17’ తో బిజీగా ఉన్నారు. ‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్‌తో సుకుమార్ మరోసారి జతకట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ క్రేజ్ ఉంది. మొత్తంగా చూస్తే.. ఆరు కథలు.. ఆరు జానర్లు.. ఆరుగురు దర్శకులు.. కానీ వెనుక ఒకే క్రియేటివ్ ఫోర్స్ సుకుమార్. ఈ ప్రయోగం టాలీవుడ్లో కొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read
- Mythri Movie Makers: మైత్రీ రిస్క్‌కు అదిరిపోయే రిజల్ట్.. ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ వెనుక ఆసక్తికర కథ!
- Kollywood: సినిమా ఇండస్ట్రీకి సెప్టెంబర్ షాక్.. కొత్త రిలీజ్‌లకు బ్రేక్.. అసలు కారణం ఇదే!
- Spirit Controversy: వంగా బ్రదర్స్ ఆరోపణలపై దీపికా పదుకొణె పరోక్ష కౌంటర్.. ఆ ఒక్క లైక్‌తో సంచలనం!
- Saha: థియేటర్లలోకి శివ కుమార్ కాసారం ‘సహ’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
తాజావార్తలు
-
Sukumar Universe: సుకుమార్ యూనివర్స్‌లో ఆరు సినిమాలు.. ఆరు షాకింగ్ జానర్లు! టాలీవుడ్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం..
-
Kia Sorento: టయోటా ఫార్చ్యూనర్‌కు సవాల్.. రూ. 28 లక్షలకే బిగ్ ఎస్యూవీ.. ఏపీలోనే తయారీ!
-
France: ఫ్రాన్స్‌లో కండోమ్‌ల కలకలం.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని సలహా..
-
Gautam Gambhir: లైక్స్, వ్యూస్ కాదు.. ట్రోఫీలే ముఖ్యం.. విమర్శకులకు గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్
-
Punjab: చిక్కుల్లో పంజాబ్ సీఎం మాన్ భార్య.. అత్యాచార కేసు లంచంపై ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశం
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!