RC 17: సుకుమార్ – దేవిశ్రీ కాంబోకి బ్రేక్.. నిజమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుకుమార్ డెబ్యూ మూవీ ‘ఆర్య’ నుంచి ‘పుష్ప 2’ వరకు డైరెక్ట్ చేస్తున్న ప్రతి సినిమాకు దేవిశ్రీనే మ్యూజిక్ డైరెక్టర్. దేవిశ్రీ, సుకుమార్ కు ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. ‘పుష్ప’, ‘పుష్ప 2’ తో దేవిశ్రీ, సుకుమార్ ప్యాన్ ఇండియా ఇమేజ్ ని సంపాదించుకున్నారు. దేవిశ్రీ లేకుండా సుకుమార్ ను ఊహించుకోలేం. కానీ ఇప్పుడు ‘పుష్ప 2’ విషయంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈ కలయికకు ఫుల్ స్టాప్ పెట్టాయంటూ కథనాలు చక్కర్లు కొట్టాయి. సుకుమార్, దేవిశ్రీది సక్సెస్ఫుల్ కాంబోనే అయినా, ‘పుష్ప 2’ బిజిఎం విషయంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. దీంతో కొన్ని సీన్స్ రీ-రికార్డింగ్ వర్క్ ని ఎస్.ఎస్. తమన్‌తో చేయించాడు సుకుమార్. ‘పుష్ప 2’ కు దేవిశ్రీ అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చాడు. టైటిల్ సాంగ్, ఫీలింగ్స్ కిస్సిక్, జాతర సాంగ్… దేనికదే అన్నట్టుగా సినిమాను మ్యూజికల్ హిట్ చేశాడు.
దేవిశ్రీ, చిరంజీవి కాంబోలో నాలుగు సినిమాలు వస్తే రెండు సూపర్ హిట్ అయ్యాయి. ముందుగా వచ్చిన ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ కు పాటలు ప్రాణంగా నిలిచాయి. ‘అందరివాడు’, ‘శంకర్ దాదా జిందాబాద్’ ఫ్లాప్ అయినా దేవిశ్రీ మాత్రం ఫెయిల్యూర్ కాలేదు. ‘వాల్తేరు వీరయ్య’ మ్యూజికల్ హిట్ తర్వాత చిరంజీవి, బాబీ కాంబో రిపీట్ అయింది. అయితే దేవిశ్రీని కాదని తమన్‌ను తీసుకున్నారు. ఈ లెక్కన రాంచరణ్, సుకుమార్ సినిమాలో కూడా దేవిశ్రీ ఉండడు అన్న టాక్ నడుస్తోంది. బుచ్చిబాబు డెబ్యూ మూవీ ‘ఉప్పెన’కు దేవిశ్రీ మ్యూజిక్ ఇచ్చాడు. రెండో సినిమా ‘పెద్ది’ దగ్గరికి వచ్చేసరికి దేవిశ్రీని పక్కన పెట్టేసి రెహమాన్‌ను తీసుకున్నాడు. కెరీర్ మొదట్లో దేవిశ్రీని ఎంకరేజ్ చేసిన మెగా హీరోస్, ప్రెసెంట్ ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ని పక్కన పెట్టేసారు అనిపించినా… సుకుమార్ త్వరలో తీయబోయే రాంచరణ్ మూవీకి మాత్రం దేవిశ్రీనే తీసుకుంటున్నారట.
Also Read
- Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
- Nidhhi Agerwal: బెట్టింగ్ యాప్స్ కేసులో నిధి అగర్వాల్‌కు ఈడీ షాక్: 4 గంటల పాటు ప్రశ్నల వర్షం!
- Jailer 2 vs Om: దసరా బరిలో మాజీ మామ వర్సెస్ అల్లుడు.. రజినీకాంత్ ‘జైలర్ 2’కు ధనుష్ ‘ఓం’ పోటీ తప్పదా?
- Akshaye Khanna: అసుర గురువుగా బాలీవుడ్ స్టార్.. ‘మహాకాళి’ నుంచి ఆగస్టు 24న అదిరిపోయే సర్ప్రైజ్!
ఈ లెక్కల మాస్టర్ కి మ్యూజిక్ విషయంలో ఓ లెక్క ఉంది, ఆ లెక్క దేవిశ్రీనే. తన బలాన్ని పక్కన పెట్టేంత సాహసం సుకుమార్ చేయాలి అనుకోవడం లేదు. మేకింగ్ కంటే మ్యూజిక్కే బలమన్న సంగతి ఈ లెక్కల మాస్టర్ కి తెలియంది కాదు. దేవిశ్రీతో వచ్చిన ఒకటి రెండు క్రియేటివ్ డిఫరెన్సెస్ తో తన ఆయుధాన్ని పక్కన పెట్టేసేంత తెలివి తక్కువవాడు కాదు సుకుమార్. సుకుమార్ చెక్కుడుకి సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ‘పుష్ప 2’ రిలీజ్ కి ముందే రాంచరణ్ సినిమా ప్రకటించారు. ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హిట్ కాంబో రిపీట్ కావడంతో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ‘పుష్ప 2’ ను మించిన కథ కోసం లెక్కల మాస్టర్ టీం తెగ కష్టపడుతోంది. ఈ క్రమంలో నెలలే కాదు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ కావడానికి ఇంకొక నాలుగైదు నెలలు పడుతుందట. ఈ లెక్కన సినిమా 2027 మొదట్లో సెట్స్ పైకి రానుంది.
తాజావార్తలు
-
Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
-
Trump: ట్రంప్‌తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
-
SBI New Withdrawal Rules: మీకు SBIలో ఈ ఖాతా ఉందా..? విత్‌డ్రాయల్‌పై కొత్త ఛార్జీలు.. నయా రూల్స్ ఇవే
-
CI Viral Video : విద్యార్థుల గొంతు నులిమిన సీఐ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.!
-
Jammu Kashmir: పాక్‌కు దిమ్మతిరిగే ప్రకటన.. కాశ్మీర్‌పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!