టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సుహాస్ తన అద్భుతమైన నటనతో ఎంతగానో మెప్పించాడు .కలర్ ఫోటో సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు .ఈ సినిమాలో సుహాస్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు .ఆ తరువాత సుహాస్ రైటర్ పద్మ భూషణ్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు.అలాగే ఇటీవల సుహాస్ నటించిన “అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్” మూవీ సూపర్ హిట్ అయింది..ఈ సినిమా భారీగా కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమాలో సుహాస్ అద్భుతంగా నటించాడు.ఇలా వరుసగా కంటెంట్ బేస్డ్ కథలను ఎంచుకుంటూ మంచి హిట్స్ అందుకుంటున్నాడు.ఇదిలా ఉంటే సుహాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రసన్న వదనం’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతోంది.మే 3వ తేదీన ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.ప్రస్తుతం సుహాస్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుహాస్ మాట్లాడుతూ “ఒకసారి నేను కథ వినేసి ఓకే చెప్పిన తరువాత ఇంక నేను దాని గురించి పట్టించుకోను.పూర్తిగా దర్శకుడినే నమ్ముతాను.కొత్త దర్శకులతో సినిమాలు చేసేటప్పుడు నేను భయపడను. ఎందుకంటే తమని తాము నిరూపించుకోవాలని ఒక పట్టుదల వారికి ఉంటుంది.సినిమా బాగా రావాలని వాళ్ళు ఎంతగానో కష్టపడతారు. అందువలన కొత్త దర్శకుల విషయంలో నాకు ఎటువంటి టెన్షన్ లేదు” అని సుహాస్ తెలిపాడు.అలాగే సుహాస్ తన రెమ్యూనరేషన్ గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసారు.నేను 3 కోట్లకి పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.నా రెమ్యూనరేషన్ ఎంతో చెప్పను గానీ, మొదట్లో నాకు ఇచ్చిన పారితోషికం కంటే ఇప్పుడు బాగానే వస్తుంది అని సుహాస్ తెలిపారు.