బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ‘స్టేజ్ ఆఫ్ సీజ్: టెంపుల్ ఎటాక్’ మూవీతో డిజిటల్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 2002లో గుజరాత్ లోని గాంధీనగర్ లోని ‘అక్షర్ధామ్’ ఆలయంపై జరిగిన దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు, 80 మందికి పైగా గాయపడ్డారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జి) ఉగ్రవాదులను వేటాడి, అదుపులోకి తెచ్చింది. ఒళ్ళు గగుర్పొడిచే ఈ ఘటన ఆధారంగా “స్టేట్ అఫ్ సీజ్ : టెంపుల్ అటాక్” తెరకెక్కుతోంది.
Read Also : “సభకు నమస్కారం” అంటున్న అల్లరి నరేష్
ఈ చిత్రంలో అక్షయ్ ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారి పాత్రను పోషితున్నారు. ఈ మిషన్ కు ఆయనే నాయకత్వం వహిస్తారు. కెన్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గౌతమ్ రోడ్, దివ్యాంక్ త్రిపాహి భర్త వివేక్ దహియా కూడా నటించారు. కాంటిలో పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ‘స్టేజ్ ఆఫ్ సీజ్’ సిరీస్‌లో రెండవ భాగం. మొదటి భాగంలో 26/11 ముంబై ఉగ్రవాద దాడులను చూపించారు. నిర్మాత అభిమన్యు సింగ్ అక్షయ్ నటనపై ప్రశంసలు కురిపించారు. మరోవైపు అక్షయ్ ఖన్నా ‘లెగసీ’ పేరుతో రాబోతున్న వెబ్ సిరీస్‌లో కూడా కనిపించనున్నాడు. ఇందులో అతను మొదటిసారి రవీనా టాండన్‌తో కలిసి నటించనున్నారు.