తమిళ స్టార్ హీరో సూర్య హిట్టు కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రెట్రో బాగా నిరాశపరిచింది. ఆ ప్రభావం ఇప్పుడు సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కరుప్పు సినిమా పై పడిందనే చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ కు ఎప్పుడో గుమ్మడికాయ కొట్టేసారు. రూరల్ బ్యాక్డ్రాప్ నేపధ్యంలో వస్తున్న ఈ కమర్షియల్ సినిమాను కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోంది. సూర్య కెరీర్ లో 45వ సినిమాగా వస్తోంది కురుప్పు.
Also Read : Coolie OTT : కూలీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఆ మధ్య సూర్య బర్త్ డే కానుకగా ‘కరుప్పు’ నుండి టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ తెచుకుంది. ఎప్పుడో షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా లేటెస్ట్ గా మరో షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. ఓ 15 రోజుల పాటు షూట్ చేసేలా ఈ షెడ్యూల్ ఉండబోతుంది. కొన్ని సీన్స్ అనుకున్న రీతిలో రాలేదని దాంతో రీషూట్ చేయాలని భావిస్తున్నారట. అలాగే కొంత మేర ప్యాచ్ వర్క్ కూడా పెండింగ్ ఉండడంతో ఈ షెడ్యూల్ లో ఫినిష్ చేసేందుకు ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ తో షూట్ ఫినిష్ చేసి రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేసి రిలీజ్ కు ఏర్పాట్లు చేయాలనీ చూస్తున్నారట భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కోలివుడ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. సాయి అభ్యంకర్ కరుప్పు టీజర్ కు అందించిన నేపధ్య సంగీతానికి మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి. ఇక సినిమాలోని సాంగ్స్, బీజీఎమ్ ఎలా ఉంటుందో చూడాలి