Site icon NTV Telugu

SSMB 29 : మహేశ్ ఎంట్రీ సీక్వెన్స్ పై రాజమౌళి గ్రాండ్ ప్లాన్!

Ssmb29, Mahesh Babu Rajamouli

Ssmb29, Mahesh Babu Rajamouli

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ ప్రాజెక్ట్‌పై, రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త కొత్త రూమర్లు హల్‌చల్ చేస్తున్నాయి. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ పాన్ వరల్డ్ సినిమా కోసం ఇప్పటికే భారీ ప్రిపరేషన్స్ జరుగుతుండగా. తాజా సమాచారం ప్రకారం, వచ్చే షెడ్యూల్‌లో మహేష్ ఎంట్రీ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు రాజమౌళి ప్లాన్ చేశారు.

Also Read : Ghee Benefits : నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా ? డాక్టర్స్ ఏమంటున్నారంటే..

ఈ ఎంట్రీ సీన్‌లో ప్రియాంక చోప్రా కూడా పాల్గొననుందని టాక్. వీరిద్దరి పాత్రల పరిచయాన్ని ఈ సీక్వెన్స్‌లోనే రివీల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు కథ దిశను కూడా ఈ సీన్‌లోనే ప్రేక్షకులకు చూపించనున్నారని సమాచారం. విజువల్స్‌, స్క్రీన్ ప్రెజెన్స్‌, ఎమోషనల్ హుక్ అన్నిటినీ కలిపి ఈ ఎంట్రీలో హైలైట్‌గా నిలవనుందట. ఇక కథ విషయానికి వస్తే.. ఇటీవ‌ల విజయేంద్ర ప్రసాద్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా రచయిత విల్బర్‌ స్మిత్‌కు పెద్ద అభిమానులం. ఆయన రచనలు మాకు ఎంతో ఇన్‌స్పిరేషన్ ఇచ్చాయి. ఈ సినిమా కథ కూడా ఆయన నవలల బేస్ మీదనే రూపొందించాం’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో సినిమా ఓ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతున్న తెలుస్తోంది.

Exit mobile version