టాలీవుడ్‌లో అతి ప్రెస్టీజియస్‌గా రూపొందుతున్న చిత్రాల్లో SSMB29 టాప్‌లో ఉంది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు మాత్రమే కాదు, ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా మేకోవర్‌లో కనిపించబోతున్నారు. ఈ కాంబినేషన్‌పై ఎలాంటి అంచనాలున్నాయో చెప్పక్కర్లేదు. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు ముగిశాయి. షూటింగ్ ప్రారంభమై కొంత భాగం పూర్తి అయింది కూడా. అయితే, ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా విడుదల కాలేదు. ఫస్ట్ లుక్, టైటిల్, మేకింగ్ వీడియో ఏవీ బయటకు రాకపోయినా… బజ్ మాత్రం ఆకాశాన్నంటుతోంది.
Also Read : Dil Raju :ప్రశాంత్ నీల్ ‘రావణం’ అప్పుడే !
అయితే తాజాగా ఈ సినిమాను గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిలింనగర్ వర్గాల్లో హల్చల్ చేస్తుంది. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. ఇది మాత్రం ఊహించదగిన విషయమే. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే పాన్-వరల్డ్ క్రేజ్, మహేష్ బాబు అంటే మాస్.. క్లాస్ బేస్. ఈ కాంబోకు ముందు నుంచే బడా ఓటీటీ సంస్థలు లైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నెట్‌ఫ్లిక్స్ మాత్రం ఈ ప్రాజెక్ట్‌ను భారీ ధరకు దక్కించుకున్నట్లు టాక్. అయితే ఈ డీల్‌పై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ఇప్పటికైతే మేకర్స్ మౌనంగానే ఉన్నా, ఓటీటీ ఇండస్ట్రీలో మాత్రం ఈ డీల్ చర్చనీయాంశంగా మారింది.