SSMB 29: రాజమౌళి – మహేశ్ ‘గరుడ’ పురాణం.. స్టోరీ ఇదే..?
- మహేశ్ బాబు అప్ కమింగ్ సినిమాపై రోజుకో రూమర్
- కెరీర్ లో 29వ సినిమాలో నటిస్తున్న సూపర్ స్టార్
- గ్లోబల్ స్టార్ గా మారనున్న మహేశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతుంది అనగానే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఇన్నాళ్ళు కొంత పరిధి మేరకు మాత్రమే పరిమితమయిన మహేశ్ క్రేజ్ గ్లోబల్ లెవల్ కి వెళుతుందని, తమ హీరో ఇక నుండి గ్లోబల్ స్టార్ గా మారిపోతాడని ఘట్టమనేని ఫ్యాన్స్ అనుకున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్, రాజమౌళి సినిమాపై రకరాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సినిమా జేమ్స్ బాండ్ తరహా నేపథ్యంలో రానుందని ఇలా ఒకటేమిటి రోజుకొక న్యూస్ వస్తుంది.
Also Read: Nani : పుష్ప -2 పోస్ట్ పోన్ పై నాని ఆసక్తికర వ్యాఖ్యలు.. అంతమాట అనేశాడేంటి..?
Also Read
తాజాగా SSMB29 కు విజువల్ డెవలపర్‌గా పనిచేస్తున్న టీపీ విజయన్ ఇన్‌స్టా స్టోరీలో గోల్డ్ కలర్‌లో ఉన్న గద్ద రెక్కల ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటో క్షణాల్లో వైరల్ అయింది. దీంతో SSMB29 రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘గరుడ’ అని ఎవరికీ తోచిన విధంగా వారు కథనాలు వండి వార్చారు. ఈ విషయమై రాజమౌళి టీమ్ ను సంప్రదించగా అలాంటిది ఏమి లేదని, ఆ కథ వేరు ఈ కథ వేరు అవన్నీ వట్టి రూమర్స్ అని కొట్టి పారేసారు. దీంతో ఇవన్నీ ఫేక్ న్యూస్ అని తేలిపోయాయి. త్వరలోనే ఈ సినిమా వర్క్ షాప్ స్టార్ట్ కానుందని సూపర్ స్టార్ మహేశ్ బాబు తో పాటు చిత్ర యూనిట్ మొత్తం ఈ వర్క్ షాప్ లో పాల్గొనబోతున్నారు. డిసెంబరు నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.ఈ చిత్రానికి GOLD అనే టైటిల్ పరిశీలిస్తున్నారని ఆ అర్ధం వచ్చేలా టీపీ విజయన్ పోస్ట్ చేసాడని యూనిట్ లోని కొందరు సభ్యులు తెలిపారు. మరి ఈ ఊహాగానాలాకు ఎప్పుడు తెరపడుతుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!