Varanasi Update: అన్నపూర్ణ స్టూడియోస్‌లో హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ.. ‘వారణాసి’ కోసం 25 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్!
- వారణాసి కోసం అత్యాధునిక మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ
- అన్నపూర్ణ స్టూడియోస్‌లో 25 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్
- ఇండియన్ సినీ ఇండస్ట్రీలో గేమ్‌చేంజర్‌గా రాజమౌళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi Movie Shooting Update: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరోసారి భారతీయ సినిమా ప్రమాణాలను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్న ‘వారణాసి’ ప్రాజెక్ట్ కోసం అత్యాధునిక మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని రాజమౌళి వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఇటీవల ప్రారంభించిన ఏ అండ్ ఎం మోషన్ కాప్చర్ సదుపాయాన్ని వారణాసి చిత్రానికి ఉపయోగించడం ప్రత్యేకంగా నిలిచింది.
హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ:
భారతదేశపు అత్యంత అధునాతన, అతిపెద్ద మోషన్ అండ్ పెర్ఫార్మెన్స్ క్యాప్చర్ ల్యాబ్‌ను టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రారంభించగా.. ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డకు చెందిన మిహిరా విజువల్ ల్యాబ్స్, అంతర్జాతీయ సంస్థ యానిమాట్రిక్ కలిసి అభివృద్ధి చేశాయి. ఈ ఆధునిక టెక్నాలజీ ద్వారా 360 డిగ్రీల ప్రీ-విజువలైజేషన్, రియల్ టైమ్ వర్చువల్ ప్రొడక్షన్, డిజిటల్ పెర్ఫార్మెన్స్ క్యాప్చర్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.
Also Read
25 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్:
ఈ టెక్నాలజీ సహాయంతో వారణాసి సినిమా కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. సుమారు 25 నిమిషాల పాటు సాగే ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను పూర్తిగా ఈ మోషన్ క్యాప్చర్ ఫెసిలిటీతో షూట్ చేసినట్లు సమాచారం. దీంతో షూటింగ్ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా.. భారీగా ఖర్చులు కూడా తగ్గనున్నాయి. అదే సమయంలో హాలీవుడ్ స్థాయి విజువల్స్‌ను అందించడంలో ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో మహేష్ బాబు, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయని ఇండస్ట్రీ టాక్.
గేమ్‌చేంజర్‌గా రాజమౌళి:
ఎస్ఎస్ రాజమౌళి తన ప్రతి చిత్రంలోనూ కొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతూ.. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి తన స్టైల్‌కు తగ్గట్టుగా వారణాసి చిత్రంలో ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే జార్జియాలో కీలక సన్నివేశాలు చిత్రీకరించిన చిత్ర బృందం.. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను పూర్తి చేసింది.ప్రియాంక ప్రస్తుతం షూటింగ్ నుంచి స్వల్ప విరామం తీసుకున్నట్లు సమాచారం. ఆమె మళ్లీ త్వరలో షూటింగ్‌లో జాయిన్ అవుతారని సమాచారం. మొత్తం షూటింగ్‌ను ఆగస్టు నాటికి పూర్తి చేయాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి వారణాసి ప్రాజెక్ట్‌తో రాజమౌళి మరోసారి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో గేమ్‌చేంజర్‌గా నిలుస్తున్నారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?