Prabhas Sreenu: “ప్రభాస్ దగ్గర డబ్బు అడగాల్సిన అవసరమే రాదు.. ఎందుకంటే!”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas Sreenu: ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రభాస్ ఉదార స్వభావం, వ్యక్తిత్వం గురించి మాట్లాడిన ఆయన.. తనకు ప్రభాస్ నుంచి లభించిన గొప్ప బహుమతి డబ్బు కాదని, ఆత్మవిశ్వాసమని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “చాలామంది ప్రభాస్ గురించి ఆయన ఎంత సహాయం చేస్తారు, ఎంత డబ్బు ఇస్తారు అని మాట్లాడుతుంటారు. కానీ నా దృష్టిలో ఆయన విలువ డబ్బుల్లో కొలవలేం. ఒక వ్యక్తికి జీవితంలో అత్యంత అవసరమైనది కాన్ఫిడెన్స్. ప్రభాస్ నాకు అదే ఇచ్చారు” అని తెలిపారు.
“సముద్రం దగ్గర బతికే వ్యక్తికి ఈత వచ్చి ఉంటే ఎలాంటి భయం ఉండదు. కానీ అదే నీరు వరదలా వస్తే ప్రాణాలు కూడా తీసేయగలదు. జీవితంలో కూడా అలాగే. మనకు ఆత్మవిశ్వాసం ఉంటే ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలం. ప్రభాస్ నాకు ఇచ్చింది ఆ కాన్ఫిడెన్స్” అని చెప్పారు. ప్రభాస్‌కు డబ్బు, సంపదలపై పెద్దగా ఆసక్తి ఉండదని ప్రభాస్ శ్రీను వెల్లడించారు. “ఆయనకు డబ్బు గురించి ఆలోచించే అలవాటు చాలా తక్కువ. ఎవరైనా మనిషిగా నచ్చితే, నిజాయితీగా ఉంటే, వారికి పూర్తిగా అండగా నిలుస్తారు. ఆయన దగ్గర ఫెయిత్, సిన్సియారిటీకి చాలా విలువ ఉంటుంది” అని పేర్కొన్నారు. తనకు ప్రభాస్ ప్రత్యేకంగా డబ్బులు ఇస్తారా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. “మనకు అవసరమైనవి అన్నీ ఇస్తారు. అడిగితే ఇంకా ఎక్కువ కూడా ఇస్తారు. కానీ జీవితంలో మనకంటూ కొన్ని విలువలు ఉండాలి. ప్రతి విషయం డబ్బుతో కొలవలేం. ప్రభాస్‌తో నా బంధం కూడా అలాంటిదే” అని స్పష్టం చేశారు. ప్రభాస్‌తో తన అనుబంధం ఆర్థిక లావాదేవీలపై ఆధారపడలేదని, అది నమ్మకం, గౌరవం, ఆత్మీయతతో కూడుకున్నదని ప్రభాస్ శ్రీను ఈ సందర్భంగా వెల్లడించారు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
-
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
-
New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!