SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SS Rajamouli: టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరుదైన మ్యూజికల్ ఫాంటసీ చిత్రం ‘సింగ్ గీతం’ (Sing Geetham). ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి ఫిల్మ్స్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి.
బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే చిత్ర యూనిట్‌కు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ‘సింగ్ గీతం’ సినిమాకు సంబంధించిన మొదటి టికెట్‌ను ఆన్లైన్లో స్వయంగా ఆయనే కొనుగోలు చేశారు. నిజానికి నాగ్ అశ్విన్, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్‌లు రాజమౌళికి వీడియో కాల్ చేసి బుకింగ్స్ ఓపెన్ చేయించాలని ప్లాన్ చేయగా.. అప్పటికే జక్కన్న టికెట్ బుక్ చేసేసుకోవడం విశేషం. సింగీతం శ్రీనివాసరావు విజన్‌పై తనకున్న అపారమైన గౌరవాన్ని రాజమౌళి ఈ విధంగా చాటుకున్నారు. ఈ క్రేజీ మూమెంట్‌కు సంబంధించిన వీడియోను వైజయంతి ఫిల్మ్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. “ఏమైంది ఏమైంది… టికెట్ బుకింగ్ ఓపెన్ అయింది!!!” అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజికల్ స్కోర్ అందించారు. రాజమౌళి స్వయంగా రంగంలోకి దిగి తొలి టికెట్ కొనుగోలు చేయడంతో ‘సింగ్ గీతం’ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
Emaindhi Emaindhi…?
Ticket Booking Open Ayindhi!!! 🎶#SSRforSSR ✨@ssrajamouli garu surprises the #SingGeetham Team by purchasing the very first ticket.Grab your tickets now! 🎟️https://t.co/5jNXDIFfAv
In cinemas worldwide from June 12th. #SingeethamSrinivasaRao… pic.twitter.com/EHuDz31Y0d
— Swapna Cinema (@SwapnaCinema) June 10, 2026
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!