Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srinivasa Mangapuram Trailer: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. అశ్విని దత్ సమర్పణలో, పి.కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్గా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతుండగా, సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. తాజాగా చిత్రబృందం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.
తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‌ను బట్టి చూస్తే.. ప్రేమ, యాక్షన్, భావోద్వేగాల సమ్మేళనంగా ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. శ్రీను, మంగా మధ్య సాగే ప్రేమకథలో బళ్లారి రాజు వెంకటప్పయ్య నాయుడు అనే పాత్ర ఎలాంటి మలుపులు తీసుకొచ్చిందనేదే కథలో ప్రధాన అంశంగా కనిపిస్తోంది. డైరెక్టర్ అజయ్ భూపతి తనదైన శైలిలో ప్రేమకథను పవర్ఫుల్ యాక్షన్, ఎమోషన్స్‌తో మేళవించినట్లు ట్రైలర్లో స్పష్టంగా తెలుస్తోంది. తొలి సినిమాతోనే జై కృష్ణ ఘట్టమనేని ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్ కనబరిచారు. ముఖ్యంగా ప్రేమ, యాక్షన్ సన్నివేశాల్లో ఆయన నటన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. హీరోయిన్ రాషా తడాని కూడా తన అందం, నటనతో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. వీరిద్దరి కెమిస్ట్రీ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మరోవైపు మోహన్ బాబు విలన్ పాత్రలో తనదైన హావభావాలు, డైలాగ్ డెలివరీతో ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు. సాంకేతికంగా కూడా సినిమా మంచి ప్రమాణాలతో తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఇప్పటికే మంచి బజ్ సొంతం చేసుకున్న ‘శ్రీనివాస మంగాపురం’ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుండగా, తాజా ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
Also Read
https://www.youtube.com/watch?v=kKIqF2oyj1Q
తాజావార్తలు
-
Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
-
Israeli-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి
-
Free Coaching: ఫీజు సున్నా.. ఉద్యోగం పక్కా! నిరుద్యోగులకు APCRDA శుభవార్త..
-
Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
-
Earbuds: 60 గంటల బ్యాటరీ లైఫ్.. బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ.. కేవలం రూ.1299లకే..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!