Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srikaanth Odela: ‘దసరా’తో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నానితో చేసిన రీసెంట్ మూవీ ‘ది ప్యారడైజ్’ రిజల్ట్‌తో ఒక్కసారిగా రూటు మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆ సినిమా మిగిల్చిన చేదు అనుభవంతో మెగాస్టార్ చిరంజీవితో అనుకున్న భారీ ప్రాజెక్ట్ అటకెక్కడం, అటు నాని కూడా వెంటనే మరో ఛాన్స్ ఇచ్చే మూడ్‌లో లేకపోవడంతో శ్రీకాంత్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది.
తన మొదటి రెండు సినిమాల్లోనూ తెలంగాణ నేటివిటీని బలంగా చూపించిన శ్రీకాంత్, మూడో ప్రయత్నంలోనూ ఆ బ్యాక్‌డ్రాప్‌ను వదిలిపెట్టడం లేదు. అయితే ఈసారి ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా, అటు తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రా ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అయ్యేలా అదిరిపోయే లైన్ రెడీ చేసుకున్నారట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన సమయంలో సాగే ఓ ఎమోషనల్ లవ్ స్టోరీని ఆయన రాసుకున్నట్లు సమాచారం. విభజన నాటి పరిస్థితులు, ఆ సమయానికి ఇరు ప్రాంతాల మధ్య నడిచిన భావోద్వేగాల నడుమ ఓ జంట ప్రేమకథ ఎలా సాగిందనే కాన్సెప్ట్‌తో ఈ స్క్రిప్ట్ సిద్ధమవుతోందని టాక్.
Also Read
- Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
- Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
- Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. 'రామాయణ' మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
- Korivi Movie: మాయా నది ఒడ్డున గుప్త నిధి.. కాపలాగా ‘కొరివి’ దెయ్యం!
‘ది ప్యారడైజ్’ ఫలితం తర్వాత అగ్ర హీరోలెవరూ వెంటనే కమిట్ అయ్యే అవకాశాలు కనిపించకపోవడంతో, భారీ బడ్జెట్ జోలికి వెళ్లకుండా కంటెంట్ బేస్డ్గా ఈ ప్రాజెక్ట్‌ను లాక్ చేయాలని భావిస్తున్నారట. ఈ లవ్ స్టోరీ కోసం యంగ్ హీరోలను తీసుకుంటారా లేక పూర్తిగా కొత్త ముఖాలతో సినిమాను పట్టాలెక్కిస్తారా అనేది త్వరలోనే తేలనుంది. సరైన ఎమోషన్ పడితే ప్రేమకథలకు ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆదరణ దక్కుతుంది కాబట్టి, ఈ విభజన లవ్ స్టోరీతో శ్రీకాంత్ ఓదెల మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారేమో చూడాలి.
తాజావార్తలు
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!