భారతీయ సినిమా చరిత్రలో గొప్ప నటి శ్రీదేవి. ఆమెతో జత కట్టని హీరో అంటూ లేడు, ఆమె నటించని భాష అంటూ లేదు. అందుకే ఆమెకు కొట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. హీరోలతో సమానంగా స్టార్ డమ్ సంపాదించుకున్న మొదటి హీరోయిన్ కూడా శ్రీదేవి అనే చెప్పాలి. అందుకే ఆమె గురించి ఇప్పటికి కూడా చాలా ఆసక్తికరమైన సంఘటనలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అలాంటి ఒక సంఘటన ఒకటి తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ బయటపెట్టారు.
Alsio Read: Sara Tendulkar : మరో స్టార్ యాక్టర్‌తో.. సారా టెండూల్కర్ డేటింగ్ !
తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా కమల్ మాట్లాడుతూ.. ‘2000 సంవత్సరంలో నేను నటించిన ‘హే రామ్’ అనే సినిమా విడుదలైంది. శ్రీదేవికి ఈ మూవీను చెన్నైలోని సత్యం సినిమాస్ థియేటర్ లో చూడాలని ఉంది. కానీ, ఆ సమయంలో శ్రీదేవి భారతదేశంలోనే అతిపెద్ద స్టార్లలో ఒకరు. ఆమె జనాదరణ వల్ల బహిరంగ ప్రదేశాల్లో తిరగడం అంటే చిన్న విషయం కాదు. ఆమె కనిపిస్తే అభిమానులు గుమిగూడేవారు, దీనివల్ల ఆమెకు, ఇతరులకు ఇబ్బంది కలిగేది. చేసేది ఏం లేక ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి శ్రీదేవి బుర్ఖా వేసుకుని సత్యం థియేటర్ కి వెళ్లి ‘హే రామ్’ సినిమా చూశారు. ఎంత పెద్ద స్టారైనా సినిమాను ప్రేక్షకులతో కలిసి చూడాలనే కోరిక ఆమెకు ఉండేది. కానీ అని వేళ్ళల అది సాధ్యం కాదు అందుకే శ్రీదేవి నా సినిమా కోసం ఇలాంటి సాహసం చేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు కమల్. ప్రజంట్ ఈ మాటలు పలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.