ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప2 గురించి చర్చ జరుగుతోంది. పుష్ప.. పుష్పరాజ్.. అస్సలు తగ్గేదేలే అంటూ రచ్చ చేస్తుంది అల్లు ఆర్మీ. పార్ట్ 1కి నేషనల్ అవార్డ్ అందుకున్న ఐకాన్ స్టార్‌కు.. మరోసారి అవార్డు ఖాయమంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక.. శ్రీవల్లిగా అదరగొట్టింది. అమ్మడికి సూపర్ క్యారెక్టర్ పడింది. అయితే.. ఈ సినిమాలో యంగ్ సెన్సేషన్ అండ్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. కిస్సిక్ అంటూ రచ్చ చేసింది అమ్మడు. నిజానికైతే.. ముందుగా ఈ పాటలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ని అనుకున్నారు. కానీ ఈ బ్యూటీ ఏకంగా 8 కోట్లు డిమాండ్ చేసింది.. దీంతో.. శ్రీ లీల దగ్గరికి ఈ ఆఫర్ వచ్చింది. ఇంకేముంది.. అల్లు అర్జున్, శ్రీ లీల డ్యాన్స్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు కిస్సిక్ అంటూ థియేటర్ లో కుమ్మేశారు.
Pushpa 2: ‘పుష్ప 2’ వేయలేదని థియేటర్ పై రాళ్ల దాడి
కానీ శ్రీ లీల ఈ స్పెషల్ సాంగ్ ఎందుకు చేసింది? అంటే, సినిమా చూస్తేనే తెలుస్తుందని చెప్పుకొచ్చింది. ‘గతంలో ఎన్నో సినిమాలకు ఐటమ్ సాంగ్ చేయమని అడిగారు. కానీ చేయలేదు. కిస్సిక్ సాంగ్ చేయడానికి మాత్రం స్ట్రాంగ్ రీజన్ ఉంది. పుష్ప-2 రిలీజైనప్పుడు అదేంటో మీకే తెలుస్తుందని..’ రిలీజ్‌కు ముందు చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు సినిమా చూసిన తర్వాత.. శ్రీలీల చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే.. ఒక్క మాటలో చెప్పాలంటే, పుష్ప2 కథను కీలక మలుపు తిప్పడంలో కిస్సిక్‌దే కీలక పాత్ర. అందుకే.. శ్రీలీల ఈ స్పెషల్ సాంగ్ చేసిందని చెప్పొచ్చు. అందరు వచ్చిండారు గానీ పార్టీకి, ఇప్పుడు దించరా ఫోటో, కిస్సిక్ అని.. అంటూ పాట స్టార్ట్ చేసిన సుకుమార్.. అసలు కథ కిస్సిక్ చుట్టే అల్లుకున్నాడు. కాబట్టే.. బన్నీతో కలిసి శ్రీలీల కిస్సిక్‌తో థియేటర్లను షేక్ చేసింది. అయితే.. కిస్సిక్ అస్సలు కథేంటో తెలియాలంటే.. మీరు సినిమా చూడాల్సిందే.