Spirit Release Date: సల్మాన్ ఖాన్ వర్సెస్ ప్రభాస్.. ‘స్పిరిట్’ డేట్ ఫిక్స్.. రూమర్స్ అన్నీ తుడిచిపెట్టేసిన మేకర్స్!
- బాక్సాఫీస్ క్లాష్ కన్ఫర్మ్..
- వెనక్కి తగ్గేదే లేదంటున్న వంగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spirit Release Date: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్న సినిమాలలో ‘స్పిరిట్’ ముందు వరుసలో ఉంటుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇటీవల సోషల్ మీడియా వేదికగా జోరుగా రూమర్స్ వస్తున్నాయి. ఈ చిత్రం వాయిదా పడినట్లు వస్తున్న వార్తలకు తాజాగా మేకర్స్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే మార్చి 5, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన సోషల్ మీడియా ఖాతాలో ధృవీకరించారు.
రూమర్లకు చెక్.. క్లారిటీ ఇచ్చిన టీమ్
సల్మాన్ ఖాన్ తన కొత్త చిత్రం (SVC 63)ను 2027 ఈద్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడంతో, ‘స్పిరిట్’ వాయిదా పడుతుందనే ప్రచారం జరిగింది. సల్మాన్‌తో పోటీ ఎందుకని సందీప్ రెడ్డి వంగా కూడా ఈ సినిమాను డిసెంబర్ 2027కు మారుస్తారనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ‘స్పిరిట్’ టీమ్ మాత్రం వీటిని కొట్టిపారేసింది. ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 5నే సినిమా రిలీజ్ అవుతుందని స్పష్టం చేసింది.
Also Read
- Sardar 2: 'స్పైడర్'లో మిస్సైన మ్యాజిక్ ఇందులో రిపీట్.. కార్తి షాకింగ్ కామెంట్స్!
- Sekhar Master: నా పుట్టు పూర్వోత్తరాలపై నిందలేస్తారా? జానీ మాస్టర్ భార్య బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే
- Ee Paata Korinavaaru : ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత పొడవైన టైటిల్
- Chadalavada :కొండపైన వెంకన్న సన్నిధిలా.. టీ నగర్లో అన్నగారి ఇల్లు
బాక్సాఫీస్ వద్ద భారీ యుద్ధం..
మార్చి మొదటి వారంలోనే ఈద్ పండుగ వచ్చే అవకాశం ఉండటంతో, సల్మాన్ ఖాన్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వస్తున్న SVC 63 తో స్పిరిట్ తలపడనుంది. సాధారణంగా భారీ చిత్రాలు క్లాష్ అవ్వకుండా జాగ్రత్త పడతాయి. కానీ ప్రభాస్ సినిమా విషయంలో మేకర్స్ చాలా ధీమాగా ఉన్నారు. సందీప్ రెడ్డి వంగా గత చిత్రం ‘యానిమల్’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన వసూళ్ల విధ్వంసం తెలిసిందే, ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్‌తో ఆయన సల్మాన్‌ను ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరుగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని సమాచారం. అంతర్జాతీయ క్రైమ్ సిండికేట్‌ను మట్టుబెట్టే పోలీస్ పాత్రలో ఆయన నటన ఈ చిత్రానికే హైలైట్‌గా ఉండనుందని సినీ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తోంది.
తాజావార్తలు
-
BLA Attack: పాక్ సైన్యంపై BLA మెరుపుదాడి.. 25 మంది సైనికులు హతం..
-
Sardar 2: ‘స్పైడర్’లో మిస్సైన మ్యాజిక్ ఇందులో రిపీట్.. కార్తి షాకింగ్ కామెంట్స్!
-
Secunderabad Army : ఆర్మీ ఆయుధాల మిస్సింగ్ కేసు.. ఐదు రోజులు గడిచినా మిస్టరీనే.!
-
Moscow: యుద్ధం ముగింపు దిశగా అడుగులు.. మాస్కోలో ట్రంప్ దూతలు చర్చలు.. పుతిన్ మెత్తబడతారా?
-
Jhiram Ghati Maoist Attack: ‘‘జీరాం ఘాటి’’ కాంగ్రెస్ నేతల దారుణహత్య.. 10 మంది దోషుల నిర్ధారణ..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!