జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజీలో మూడవ చిత్రం “జురాసిక్ వరల్డ్: డొమినియన్”. చిత్ర నిర్మాతలు తాజాగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. జురాసిక్ వరల్డ్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ వీడియోను పోస్ట్ చేస్తూ మేకర్స్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ థ్రిల్లర్ మూవీ అభిమానులకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే… యాక్షన్ ప్రియులు ఆతృతగా ఎదురు చూస్తున్న “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-9” (F9) మూవీని ప్రదర్శించబోయే ఐమాక్స్ థియేటర్లలో “జురాసిక్ వరల్డ్: డొమినియన్” సినిమాకు సంబంధించి ఐదు నిమిషాల ప్రివ్యూ వేయబోతున్నారట. కేవలం ‘F9’ను ప్రదర్శించబోయే ఐమాక్స్ థియేటర్లలోనే ఈ ప్రివ్యూ ఉండనుంది.
Read Also : తలపతి విజయ్ కు సినీ ప్రముఖుల బర్త్ డే విషెస్
“వచ్చే వేసవిలో డైనోసార్‌లు భూమిని శాసిస్తాయి. ఈ శుక్రవారం (జూన్ 25) # F9 IMAX స్క్రీనింగ్‌లో ఒక స్నీక్ పీక్ ను వీక్షించండి” అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఆ వీడియో చూస్తుంటే ఈ చిత్రం 65 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్ల కొత్త జాతులకు సంబంధించి ఉండబోతున్నట్టు స్పష్టం అవుతోంది. ఈ చిత్రంలో క్రిస్ ప్రాట్, బ్రైస్ డల్లాస్ హోవార్డ్ ప్రధాన పాత్రల్లో నటించారు. “జురాసిక్ వరల్డ్ : డొమినియన్”కు కోలిన్ ట్రెవరో దర్శకత్వం వహించారు. ఇందులో క్రిస్ ప్రాట్, బ్రైస్ డల్లాస్ హోవార్డ్… ఓవెన్ గ్రేడి, క్లైర్ డియరింగ్ అనే పాత్రల్లోనే మళ్ళీ కనిపించనున్నారు. ఈ చిత్రం 2022 జూన్ 10న ప్రేక్షకులను థ్రిల్ చేయనుంది.
Next summer, dinosaurs rule the earth. Get a sneak peek this Friday, only on IMAX screenings of #F9. pic.twitter.com/cMq6tu7z7R
— Jurassic World (@JurassicWorld) June 21, 2021