Sobhita Expresses Her Love on Naga Chaitanya after Engagement: నాగచైతన్యను ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా శోభిత తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది. నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ సమయంలో దిగిన కొన్ని ఫోటోలను ఆమె తన ఇంస్టాగ్రామ్ ఐడి ద్వారా షేర్ చేసింది. అంతేకాక మరికొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా ఆమె షేర్ చేస్తూ ఒక తమిళ కవి రాసిన కొటేషన్ కూడా షేర్ చేసింది. నా తల్లి నీకు ఏమి కావచ్చు ? ఏమైనప్పటికీ, నా తండ్రి మీకు ఎలా బంధువు ? మీరు మరియు నేను ఎప్పుడైనా ఎలా కలుసుకున్నామ? కానీ ప్రేమలో మన హృదయాలు ఎర్రటి భూమిలా, కురిసే వర్షంలా ఉన్నాయి: విడిపోవడానికి మించి కలిసిపోయాయి అంటూ తన ప్రేమను కవితాత్మకంగా చెప్పే ప్రయత్నం చేసింది.
Bhagyashri Borse: అది కష్టం అనిపించింది : హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇంటర్వ్యూ
సమంతా నాగచైతన్య విడిపోయిన తరువాత నాగచైతన్య శోభతో కలిసి డేటింగ్ చేస్తున్నాడు అనే వార్తలు అనూహ్యంగా తెరమీదకు వచ్చాయి. కొంతమంది అయితే ఇప్పటికీ సమంతా నాగచైతన్య విడిపోవడానికి కారణం శోభిత అనే నమ్ముతారు. కానీ శోభిత తరువాత నాగచైతన్య జీవితంలోకి వచ్చిందని నాగచైతన్య సన్నిహితులు చెబుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ నిన్న వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకుని ఒకటయ్యారు, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అయితే వీళ్ళ బంధం కూడా ఎక్కువ కాలం కొనసాగదని మరో మూడేళ్లు మాత్రమే వీళ్ళు కలిసి ఉంటారని ఆ తర్వాత విడాకులు తీసుకునే అవకాశం ఉందని సెలెబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పడం సంచలనంగా మారింది. అయితే నాగార్జున షేర్ చేయని కొన్ని ఫోటోలను సైతం శోభిత షేర్ చేసింది. దీంతో అభిమానులు వీళ్ళు భలే సరదాగా ఉన్న ఫోటో లీక్ చేసిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.