Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Bhagyashri Borse Interview For Mr Bachchan

Bhagyashri Borse: అది కష్టం అనిపించింది : హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇంటర్వ్యూ

Published Date :August 9, 2024 , 9:06 pm
By Bhargav Chaganti
Bhagyashri Borse: అది కష్టం అనిపించింది : హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇంటర్వ్యూ
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Bhagyashri Borse Interview for Mr Bachchan: మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించగా రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానున్న నేపథ్యంలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

మీకు సినిమాలపై ఇంట్రస్ట్ ఎప్పుడు ఏర్పడింది ? మిస్టర్ బచ్చన్ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
-మాది ఔరంగాబాద్, మహారాష్ట్ర. మా నాన్నగారు ఉద్యోగ రీత్యా లాగోస్(నైజీరియా) షిఫ్ట్ అయ్యారు. అక్కడ నా స్కూలింగ్ జరిగింది. బిజినెస్ మేనేజ్మెంట్ చదువు కోసం ముంబై వచ్చా, గ్రాడ్యుయేషన్ లో ఉండగా చాలామంది మోడలింగ్ చేయమని ప్రోత్సహించారు. ఆ ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన తర్వాత చాలా నచ్చి కెమెరా భయం పోయింది. కొన్ని కమర్షియల్స్ చేశాను. -మంచి అవకాశం ఎదురుచూస్తున్నప్పుడు మిస్టర్ బచ్చన్ అవకాశం వచ్చింది. హైదరాబద్ కి వచ్చి ఆడిషన్ ఇచ్చా, నా ఆడిషన్ మేకర్స్ కి నచ్చి జిక్కీ పాత్రకు నేను పర్ఫెక్ట్ అని సెలెక్ట్ చేశారు. తర్వాత లుక్ టెస్ట్ కోసం వచ్చినపుడు రవితేజ గారిని కలిశా.

Also Read

  • Sreeleela: తమిళనాడు కోడలిగా శ్రీలీల..? తాజా కామెంట్స్ హాట్ టాపిక్!
  • NBK - Vivek Athreya : వివేక్ ఆత్రేయ సినిమాలో ‘బాలయ్య' డ్యూయల్ రోల్.. ఊచకోత అన్ లిమిటెడ్
  • Raj Tarun: నిద్రలో నడుస్తూ హత్యలు.. రాజ్ తరుణ్ 'టార్టాయిస్' ఫస్ట్ లుక్ రిలీజ్!
  • Back-to-Back Surprises : ఎన్టీఆర్ - చరణ్ సమ్మర్ హీట్ పెంచేశారుగా
Add as a preferred
source on google

మీ మొదటి సినిమాతోనే మాస్ మహారాజా రవితేజ గారితో నటించే అవకాశం వచ్చింది కదా.. ఆయన ఎనర్జీ మ్యాచ్ చేయగలిగారా ? –
నేను ఏదైనా చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. హార్డ్ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. రవితేజ గారితో వర్క్ చేయడం చాలా ఎక్సైటింగ్ అనిపించింది. రవితేజ గారు ఛార్మింగ్ పర్సనాలిటీ.

ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతోంది ? -ఇందులో నా పాత్ర పేరు జిక్కీ. తను తెలుగు మార్వాడి గర్ల్. తను చాలా క్యూట్, లవబుల్. డైరెక్టర్ గారు ఈ క్యారెక్టర్ ని చాలా బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దారు. బచ్చన్ లైఫ్ లో జిక్కీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సినిమా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేసేలా ఉంటుంది.

ఇందులో మీ మెమరబుల్ మూమెంట్ ? -ఇందులో క్యాసెట్ రికార్డింగ్ షాప్ లో ఓ సీన్ ఉంటుంది. ఆ సీన్ చేసిన తర్వాత డైరెక్టర్ గారు.. ‘ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యు’ అన్నారు. అది నాకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది.

తొలి సినిమాకే తెలుగులో డబ్బింగ్ చెప్పడం ఎలా అనిపించింది ? -ఇది నా మొదటి తెలుగు సినిమా. నా వాయిస్ ఐతే ఆడియన్స్ మరింత రిలేట్ చేసుకుంటారని డైరెక్టర్ గారిని కోరాను. తెలుగు డబ్బింగ్ చెప్పడం మొదట్లో కాస్త డిఫికల్ట్ అనిపించింది. అయితే డైరెక్షన్ డిపార్ట్మెంట్, టీం చాలా సపోర్ట్ చేసింది. దాదాపు వారం రోజుల్లో డబ్బింగ్ ఫినిష్ చేశాను. చాలా బావొచ్చింది.

షూటింగ్ లో ఎదురుకున్న ఛాలెంజ్ కి పార్ట్ ఏమిటి ? -నేను నార్త్ అమ్మాయిని. తెలుగు భాషను మొదట్లో అర్థం చేసుకోవడం కాస్త కష్టం అనిపించింది. ప్రతి డైలాగ్ ని నా మాతృభాషకి ట్రాన్స్ లేట్ చేసుకుని అర్థం చేసుకున్నాను. అయితే కొద్దిరోజుల తర్వాత భాషపై పట్టు సాధించాను. తర్వాత అంత ఈజీ అయ్యింది. తెలుగు భాష చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. పూర్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.

హరీష్ శంకర్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? – హరీష్ గారు చాలా ప్యాషనేట్ డైరెక్టర్. హరీష్ గారితో వర్క్ చేయడం చాలా ఫన్ ఎక్స్ పీరియన్స్. హరీష్ గారు, రవి గారికి ఎంతో అనుభవం వుంది. నేను ‘చందూ ఛాంపియన్’ లో చిన్న క్యామియో తప్పితే సినిమాలు చేయలేదు. హరీష్ గారు, రవి గారు చాలా సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్ తో ఎక్కడా డిఫికల్ట్ ఫీల్ అవ్వలేదు. ప్రతి సీన్ ని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాం.

రవితేజ గారి నుంచి ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు ? -రవితేజ గారు ఎన్నో సినిమాలు చేశారు. కానీ ఇప్పటికీ ఆయన న్యూ కమ్మర్ లానే ఉంటారు. సెట్ లో టైంకి వుంటారు. ఎవరికీ ట్రబుల్ ఇవ్వరు. అందరినీ కేరింగ్ గా చూసుకుంటారు. మనం ఏ స్టేజ్ వున్నా మన క్రాఫ్ట్ కి గౌరవం ఇవ్వాలని ఆయన్ని చూసి నేర్చుకున్నాను. మిక్కీ జే మేయర్ గురించి ? -మిక్కీ గారు బ్యూటీఫుల్ సాంగ్స్ ఇచ్చారు. రెప్పల్, డప్పుల్, సితార్, జిక్కీ పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఎక్కడా విన్నా ఇవే పాటలు వినిపిస్తున్నాయి. నా మొదటి సినిమాకే ఇంత అద్భుతమైన ఆల్బం రావడం చాలా ఆనందంగా వుంది.

పాటల్లో మీ డ్యాన్స్ మూమెంట్స్ ట్రెండింగ్ లో వున్నాయి ? ఈ రెస్పాన్స్ ఊహించారా ?
నాకు డ్యాన్స్ ఇష్టం. ఫ్రీ టైం లో డ్యాన్స్ చేస్తుంటాను. మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఆడిటోరియం దద్దరిల్లింది. డ్యాన్స్ మూమెంట్స్ కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా వుంది. ఇదొక డ్రీం కం ట్రూ మూమెంట్.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ గురించి ? -నా మొదటి తెలుగు సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో చేయడం చాలా ఆనందంగా వుంది. వారు చాలా స్వీట్ పీపుల్. చాలా కంఫర్టబుల్ గా చూసుకున్నారు. వారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్.

మిమ్మల్ని నేషనల్ న్యూ క్రష్ అంటున్నారు ? థాంక్ యూ. అదొక కాంప్లిమెంట్ లా తీసుకుంటాను. (నవ్వుతూ)

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ? -కొన్ని ప్రాజెక్ట్స్ వున్నాయి. మేకర్స్ అనౌన్స్ చేస్తారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bhagyashri Borse
  • Bhagyashri Borse interview

తాజావార్తలు

  • Sreeleela: తమిళనాడు కోడలిగా శ్రీలీల..? తాజా కామెంట్స్ హాట్ టాపిక్!

  • Ali : అలీ కీలక పాత్రలో కొత్త సినిమా ప్రారంభం!

  • NBK – Vivek Athreya : వివేక్ ఆత్రేయ సినిమాలో ‘బాలయ్య’ డ్యూయల్ రోల్.. ఊచకోత అన్ లిమిటెడ్

  • CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!

  • Raj Tarun: నిద్రలో నడుస్తూ హత్యలు.. రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ ఫస్ట్ లుక్ రిలీజ్!

ట్రెండింగ్‌

  • Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్‌ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions