అక్కినేని కోడలిగా త్వరలో నాగ చైతన్యతో ఏడడుగులు వేయనుంది శోభిత ధూళిపాళ్ల. ఒకవవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది శోభిత. ఇక ఇటీవల హాలీవుడ్‌లోకీ అడుగుపెట్టింది. ఈ సందర్భంగా శోభిత తన ఇష్టాలు, చైతుతో లవ్ గురించి పంచుకుంది..
మాది ఆంధ్రప్రదేశ్ లోని తెనాలి నేను పుట్టింది అక్కడే. నాన్న నేవీ ఇంజినీర్‌గా వైజాగ్‌లో పనిచేయడంతో అక్కడే పెరిగా. అమ్మ టీచర్ కావడంతో ఎక్కువగా పుస్తకాలు ఉండేవి, అలా చదవడాన్ని హాబీగా మార్చుకున్న. నేను చదివిన తొలి పుస్తకం ‘బుడుగు’ , ఇంటర్‌లో చేరినప్పుడు ఆర్థిక విషయాలకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినడం చదవడం చేస్తుండే దాన్ని. ఎప్పటికైనా భారత రాష్ట్రపతి దగ్గర చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్‌గా పనిచేయాలని కలలు కనేదాన్ని. ముంబైలో డిగ్రీ చదివేటప్పడు మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాక మోడలింగ్ చేయడం స్టార్ట్ చేశా.
Also Read : Akkineni : కొండా సురేఖను హెచ్చరించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నటుడు
మా చెల్లి సమంత తను నా సోల్‌మేట్. ఈ మధ్యనే సమంతకు పెళ్లైంది. సినిమాలు,షూటింగ్స్ లో బిజీగా ఉండడడంతో కుటుంబానికీ, బంధువులకీ చాలా కాలంగా దూరంగా ఉన్నా. సమంతపెళ్లిలో మళ్ళి అందర్నీ కలుసుకున్నా.పెళ్లి కూతురుగా అందంగా ముస్తాబై మండపంలో కూర్చున్న నా చెల్లి సమంతను చూసినప్పుడు మాత్రం ఆనందంతో కళ్లలో నీళ్లు తిరిగాయి. నాకు భక్తి ఎక్కువే. ఉదయాన్నే పూజ చేయడం, సూర్యాష్టకం చదవడం అలవాటు. నేను పూర్తీ శాకాహారిని. ఆవకాయ, పులిహోర, ముద్దపప్పు, పచ్చిపులుసు ఎంతిష్టమో. చిన్నప్పట్నుంచీ అమ్మ కావాలనే కోరిక ఉండేది. అమ్మా అని పిలిపించుకోవడం, మాతృత్వపు మాధుర్యం నాకు అద్భుతంగా అనిపిస్తాయి. చైతూ విషయాని కొస్తే చాలా మర్యాదస్తుడు చాలా మంచివాడు. ఎంతో హుందాగా ప్రవర్తిస్తాడు. ఎప్పుడూ ప్రశాంతంగా, కూల్‌గా ఉంటాడు. ఈ క్వాలిటీస్ చైతూతో ప్రేమలో పడేలా చేసాయి.