Sobhita Dhulipala shares stunning pics showing off her engagement ring: నాగ చైతన్య, సమంతను 2017లో వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం గోవాలో జరిగింది. వీరి వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావడంతో నాలుగేళ్ల తర్వాత పెళ్లికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నారు. దీని ప్రకారం, 2021 సంవత్సరంలో, వారిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోతున్నట్లు ప్రకటించారు. సమంత – చైతన్యల పెళ్లి బ్రేకప్ అభిమానులందరికీ షాక్ ఇచ్చింది. చైతన్య తన బాధను బయటపెట్టకపోయినా.. సమంత మాత్రం ఈ ఎపిసోడ్ నుంచి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. నాగ చైతన్య సమంతతో విడిపోయిన తరువాత శోబితతో డేటింగ్ ప్రారంభించాడని వార్తలు వచ్చాయి.
Telugu Indian Idol 3: తెలుగు ఇండియన్ ఐడల్ 3 కంటెస్టెంట్స్ కు పవన్ కల్యాణ్ ప్రశంసలు
ఆ వార్తలను నిజం చేస్తూ వీరి నిశ్చితార్థం గత నెల (ఆగస్టు 8)న హైదరాబాద్‌లోని నాగార్జున ఇంట్లో ఘనంగా జరిగింది. ఇరువైపులా ఉన్న ముఖ్యులు మాత్రమే పాల్గొన్న ఈ ఎంగేజ్మెంట్ తర్వాత, సమంత పోస్ట్‌లు వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా శోభిత పసుపు మరియు నలుపు చీరలో విభిన్నమైన డిజైన్ ఆభరణాలతో ఉన్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో నాగ చైతన్య తన నిశ్చితార్థం సందర్భంగా ఆమె వేలికి తొడిగిన ఉంగరం శోభిత చేతికి మెరుస్తూ కనిపించింది. ఇక నాగ చైతన్య శోభిత ఫోటోలను లైక్ చేస్తూ తన ప్రేమను వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది మార్చిలో శోభిత, నాగ చైతన్యల వివాహం జరగనుందని సమాచారం. ఇక వీరి పెళ్లిని రామోజీ రాజ్ ఫిల్మ్ సిటీలో జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారని అంటున్నారు