కేంద్ర మాజీ మంత్రి.. సీనియర్ స్టార్ నటి స్మృతి ఇరానీ గురించి పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తిరిగి బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆమె. ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2’ ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే తాజాగా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన పని గంటల విషయం పై స్మృతి ఇరానీ ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Also Read : Hrithik Roshan : హైకోర్ట్‌ను ఆశ్రయించిన హృతిక్ రోషన్..
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె పని గంటల కారణంగా కొన్ని భారీ ప్రాజెక్ట్‌ల నుంచి తప్పుకున్న వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ స్మృతి ఇరానీ.. “ఇది పూర్తిగా దీపికా వ్యక్తిగత సమస్య. కానీ నేను ఎప్పుడూ నిర్మాతలకు లాభాలు రావాలని అంకితభావంతో పని చేస్తాను. కొందరు పని గంటల విషయాన్ని వివాదాస్పదంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నాకది పెద్ద విషయం కాదు. సీరియల్ షూటింగ్ సమయంలోనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాను. ఆ సమయంలో కూడా నిర్మాతల కోణాన్ని పరిగణలోకి తీసుకుని వారికి న్యాయం చేయాలనే కష్టపడి పని చేశాను. నిర్మాతలకు లాభాలు రావడం ఒక నటిగా నా బాధ్యత” అని స్పష్టం చేశారు.
అంతేకాక, స్మృతి ఇరానీ తన వ్యక్తిగత, నాటకీయ, రాజకీయ బాధ్యతలపై కూడా సమతుల్యతగా వ్యవహరించాల్సిందని తెలిపారు. “నటి కావడం, రాజకీయాల్లో చేరడం, తల్లిగా పిల్లల సంరక్షణ చూడడం ఇవన్నీ నా ఎంపికలు. వాటిని సమానంగా నిర్వహించకపోతే, నిర్మాతలు భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేను షూట్‌కు రాకపోవడం వల్ల 120 మంది జీతం అందకపోవడం, వారి కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది. అందుకే ఎల్లప్పుడూ భిన్నంగా, బాధ్యతాయుతంగా ఆలోచిస్తాను” అని చెప్పారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.