ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన లేటెస్ట్ దీపావళి బ్లాస్ట్ ‘డ్యూడ్’. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. మమిత బైజు హీరోయిన్‌గా నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 17న విడుదలైన ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుని బ్లాక్‌బస్టర్ సక్సెస్‌గా నిలిచింది. ఈ సందర్భంగా మేకర్స్ ‘డ్యూడ్ బ్లాక్‌బస్టర్ 100 cr జర్నీ’ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ.. “మైత్రి మూవీ మేకర్స్ వారు 2000 కోట్ల సినిమాను చూసిన నిర్మాతలు. వారికి ప్రతి నెలా ఒక బ్లాక్‌బస్టర్ వస్తూనే ఉంటుంది. ఈ దీపావళికి విడుదలైన ‘డ్యూడ్’ ఒక పాన్ సౌత్ బ్లాక్‌బస్టర్ కావడం చాలా ఆనందంగా ఉంది. నవీన్ గారు, రవి గారి విజన్ వేరు. వారి కిరీటంలో మరో మైలురాయి చేరినందుకు నా అభినందనలు,” అని అన్నారు.
Also Read :Pradeep Ranganathan: 100 కోట్ల క్రెడిట్ తెలుగు ఆడియెన్స్‌కి ఇచ్చిన ‘డ్యూడ్’..
దర్శకుడిని అభినందిస్తూ, “తొలి సినిమా విజయం సాధించడం చాలా స్పెషల్. అందులోనూ 100 కోట్ల సినిమా సాధించిన డైరెక్టర్ కీర్తికి కంగ్రాజులేషన్స్. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక సుకుమార్ గారి సినిమా చూస్తున్నంత ఇంటెన్సిటీ ఫీల్ అయ్యాను,” అని ప్రశంసించారు. హీరోయిన్‌పై మాట్లాడుతూ, “మమిత ఒక లక్కీ హ్యాండ్. అద్భుతంగా నటించారు, తనకు మరెన్నో విజయాలు రావాలి,” అని కోరుకున్నారు.
Also Read :Kumari 22F: సుక్కూ భార్య కొత్త నిర్మాణ సంస్థలో కుమారి 21F సీక్వెల్
తెలుగు-తమిళ అనుబంధం గురించి ఎస్కేఎన్ మాట్లాడుతూ.. “తెలుగు, తమిళ్ ఒకే స్టేట్. కమల్ హాసన్ గారు, రజినీకాంత్ గారు, సూర్య, అజిత్, ధనుష్, విజయ్ సేతుపతి గారు.. ఇలా ఏ తమిళ్ స్టార్ వచ్చినా సరే మా సొంత సినిమాలానే ప్రేమిస్తాం. ఇప్పుడు ప్రదీప్ గారు కూడా ఈ ఎలైట్ క్లబ్‌లో జాయిన్ అయ్యారు. వరుసగా మూడు వంద కోట్ల సినిమాలు ఇచ్చి ఇండస్ట్రీని మూడుసార్లు షేక్ చేశారు. ప్రదీప్ గారు కేవలం హీరో మెటీరియల్ కాదు, యాక్టర్ మెటీరియల్ మరియు స్టార్ మెటీరియల్. ఆయన ఇంకా ఎన్నో విజయవంతమైన సినిమాలు చేయాలని, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను,” అని ముగించారు.