టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహించిన రాయన్ సినిమాలో సహాయ నటుడుగా అదరగొట్టాడు సందీప్ కిషన్. ఈ చిత్రంలో సందీప్ నటనకు అద్భుత స్పందన లభించింది. కాగా ఈ యంగ్ హీరో ధమాకా ఫేం దర్శకుడు త్రినాథరావు దర్శకత్వంలో మజాకా అనే సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ కెరీర్ లో 30వ సినిమాగా రానుంది.
Also Read : Darling : ప్రభాస్ మెచ్చిన “లవ్” ఎవరో తెలుసా..?
త్రినాథ రావు దర్శకత్వలో రానున్న ఈ సినిమాలోని ఎంటర్టైన్మెంట్ గురించి ఇండస్ట్రీ లో చాలా కాలంగా మంచి టాక్ నడుస్తోంది. ఈ దర్శకుడు త్రినాధరావు హిలేరియస్ కామెడీ నేపధ్యలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బహుశా ఆ నమ్మకంతోనే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ బాబీ సినిమా ఉన్న కూడా పొంగల్ రావాలని డిసైడ్ అయ్యారట మేకర్స్. కామెడీ వర్కౌట్ అయితే పండగకు పెర్ఫెక్ట్ సినిమాగా మారుతుందని యూనిట్ గట్టి నమ్మకంగా ఉంది. ఎవరు వచ్చిన రాకున్నా సరే ఈ చిత్రాన్ని ఈ సంక్రాంతికి కానుకగా జనవరి 14న రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు మేకర్స్. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తుండగా త్రినాధ్ రావు ఆస్థాన రైటర్ బెజవాడ ప్రసన్న కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.