Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sivakarthikeyan: తమిళ చిత్రసీమలో ఇప్పుడు వెండితెర కంటే తెరవెనుక సాగుతున్న రాజకీయ సమీకరణాలే ఎక్కువ సెగలు పుట్టిస్తున్నాయి. అగ్ర కథానాయకుడు విజయ్ రాజకీయ రంగప్రవేశం చేసి పార్టీని ప్రకటించినప్పటి నుంచే కోలీవుడ్‌లో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఆ పరిణామాల వేడి తగ్గకముందే, తాజాగా మరో స్టార్ హీరో శివకార్తికేయన్ నిర్వహించిన ఫ్యాన్స్ మీట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సినిమా ప్రమోషన్ల టైంలోనే, పుట్టినరోజుల సందర్భగానో అభిమానులను కలవడం వేరు, కానీ శివకార్తికేయన్ నిర్వహించిన మీటింగ్ మాత్రం ఒక రాజకీయ వ్యూహ సదస్సును తలపించిందన్న కామెంట్స్ రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రజలకు చేరువయ్యేలా సేవా కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆయన తన ఫ్యాన్స్ అసోసియేషన్లకు దిశానిర్దేశం చేయడం ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఎంజీఆర్, విజయకాంత్ నుంచి మొన్నటి కమల్ హాసన్, నిన్నటి విజయ్ వరకూ… తమిళనాడులో సేవా సంస్థల నుంచే రాజకీయ ప్రస్థానాలు మొదలయ్యాయి.
ఇప్పుడు శివకార్తికేయన్ కూడా భవిష్యత్ రాజకీయాల కోసం ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో బలాన్ని సమీకరించుకుంటున్నారా అనే చర్చ కోలీవుడ్‌ను కుదిపేస్తోంది. కేవలం శివకార్తికేయన్ మాత్రమే కాదు, ఇటీవల కాలంలో ధనుష్, సూర్య లాంటి తమిళ అగ్ర హీరోలతో పాటు టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ సైతం అభిమానులతో ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అవుతూ వస్తున్నారు. హీరోలంతా ఒకరి తర్వాత ఒకరు ఫ్యాన్స్ మీటింగులకు ప్రాధాన్యతనిస్తుండటం చూస్తుంటే, ఇది కేవలం సినిమా అభిమానానికి సంబంధించిన వ్యవహారమే కాదన్న సందేహాలు బలపడుతున్నాయి. రాబోయే కాలంలో రాజకీయ ప్రవేశం చేయాలనుకునే ఆలోచనతోనే హీరోలు తమ ఫ్యాన్ బేస్‌ను పకడ్బందీ వ్యవస్థగా (క్యాడర్ తరహాలో) మలుచుకుంటున్నారా అన్న డౌట్స్ సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. నాయకులను ఆరాధించడం నుంచి నేరుగా పాలకులను చేసే సంస్కృతి ఉన్న తమిళ గడ్డపై, ఏ హీరో అభిమానుల సమావేశం పెట్టినా అది పాలిటిక్స్‌తో ముడిపడటం సహజమే. అయితే తెరవెనుక వినిపిస్తున్న ఈ గుసగుసలకు ముగింపు పలకాలంటే మాత్రం ఆయా స్టార్లే నేరుగా స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Also Read
తాజావార్తలు
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
-
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?