ఈ మధ్యనే ‘తెలుసు కదా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం ‘బాడ్ యాస్’ అనే సినిమా చేస్తున్నాడు. తన స్నేహితుడైన దర్శకుడు రవికాంత్ పేరేపు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా, ఒక నటుడి సక్సెస్ స్టోరీ ఆధారంగా రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హీరో పాత్రలో నటిస్తున్నాడు, అంటే సినిమా హీరో, హీరోగా నటిస్తున్నాడన్నమాట.’బాడ్ యాస్’ అనేది బూతు పదంలా అనిపిస్తుంటే, దాని శీర్షిక మరింత బూతు పదంలా అనిపిస్తోంది.
Also Read : Nani : పక్కింటి అబ్బాయితో పూజా హెగ్డే.. ఆశ నెరవేరుస్తాడా?
“ఇఫ్ మిడిల్ ఫింగర్ వాజ్ ఏ మ్యాన్” అంటూ ట్యాగ్లైన్ పెట్టడం చర్చనీయాంశమైంది. అయితే ఇటీవల ఈ సినిమా స్టోరీని సిద్ధు జొన్నలగడ్డ స్వయంగా లీక్ చేశాడు. తాను ఈ ‘బాడ్ యాస్’ సినిమాలో నటిస్తున్నానని, ఒక నటుడి జర్నీ అని చెప్పుకొచ్చారు. అంతేకాక, ఒక తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్ ఆధారంగా ఈ సినిమా రాసుకున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఇక ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇది తెలుగు సినీ పరిశ్రమలోనే డార్కెస్ట్ సినిమా అని కూడా అంటున్నారు.