మనం సినిమా చూస్తున్నాం. తన అభిమాన సినిమాను ఆస్వాదిస్తూ.. అందులో నిమగ్నమై ఉంటాం. ఆసీన్స్ ను చూస్తూ ఆనందంగా ఆసినిమాను చూస్తూండగా ఒక్కసారిగా ఆసీన్ లో చూసే హీరో గానీ, హారోయిన్‌గానీ ఎంట్రీ ఇస్తే.. ఎలాఉంటుంది? ఆ.. ఆనందమే వేరు. వారు మన ఎదుట మాట్లాడుతూ.. మమల్ని చూస్తూ నవ్వుతూ మనమాటలో మాట కలుపుతుంటే ఆరేంజే వేరబ్బా.. సినిమా చూస్తుండగా ఓ హీరోయిన్ సినిమా హాల్లో ఎంట్రీ ఇచ్చింది. సినిమా చూస్తున్న తన అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇదంతా మన భాగ్యనగరంలో చోటుచేసుకుంది. ఇక అభిమానుల ఆనందానికి హద్దులేకుండా పోయాయి. కాసేపు సినిమాలో వున్న హీరోయిన్ ఇలా మన ముందు ఎదురుగా నిలబడి మాట్లాడటం ఏంటని డైలమాలో వుండిపోయారు. సెల్ ఫోన్ తీసి ఇది నిజమేనా అంటూ రికార్డుచేస్తూ ఓయ్ అంటూ అరపులు కేకలు వినిపించాయి. నిజమేకాదా మరి అభిమానించడం వేరు అభిమానించి వారు ఎదురు పడితే ఆ.. ఆనందమే వారుమరి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనేదేగా ఆమె మన గబ్బర్‌సింగ్ హీరోయిన శ్రుతి హాసన్.
తెరపై 3త్రీ మూవీ ప్రేక్షకులు వీక్షిస్తున్న సమయంలో ఒక్కసారిగా శ్రుతి సినిమా హాల్లో ప్రత్యక్షమైంది. ధనుష్, శ్రుతిహాసన్ జంటగా సుమారు పదేళ్ల క్రితం తెరకెక్కిన చిత్రమిది. రీరిలీజ్ ట్రెండ్‌లో భాగంగా నిర్మాత నట్టి కుమార్ తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమాని గురువారం విడుదల చేశారు.ఈ చిత్రం ప్రదర్శితమవుతున్న హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి-మియాపూర్ ఎఎంబీ మల్టీప్లెక్స్‌లోకి శ్రుతిహాసన్ అకస్మాత్తుగా వెళ్లి, సినిమాని వీక్షిస్తున్న వారిని సర్‌ప్రైజ్ చేశారు. అయితే.. అప్పటి వరకూ తెరపై కనిపించిన ఆమె తెర ముందు ప్రత్యక్షమవడంతో అక్కడున్న వారంతా అవాక్కయిన వారంతా.. వెంటనే తేరుకొని హంగామా చేశారు. వారందరి ఉత్సాహానికి ఫిదా అయిన శ్రుతి హాసన్, ఆ సినిమాలోని ఓ హిట్ సాంగ్ కన్నులదా ఆలపించారు. దీంతో.. ఆడియెన్స్ ఆమెతో శ్రుతి కలిపారు.
ఇదంతా గురువారం రాత్రి నెలకొనగా విజువల్స్ నిన్న శుక్రవారం బయటకు వచ్చాయి. ఈవీడియోను శ్రుతి తన ఇస్టాగ్రామ్ లో పోస్టే చేసారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అసలు శ్రుతి హాసన్ వచ్చారా? అంటూ అవాక్కవుతున్నారు. ఛా.. నేను మిస్సయాను అంటూ కొందరు అభిమానులు చాలా షాడ్ గా ఫీలవుతున్నారు. మరొకొందరైతే శ్రుతి యూ ఆర్ క్రేజీ అంటూ కామెంట్ చేస్తున్నారు. నిజంగా ఇదంతా జరిగిందని శ్రుతి ఇస్టా ఫాలో అవుతున్న వారంతా సోషల్ మీడియాలో చూస్తు వావ్ అంటూ పోస్ట్ చేస్తున్నారు. ఏదైతే నేం శ్రుతి హైదరాబాద్ లో సందడి చేయడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. 3 త్రీ మూవీ విభిన్న ప్రేమ కథా చిత్రాన్ని రజనీకాంత్ తనయ ఐశ్వర్య తెరకెక్కించారు. ఇక 2012లో విడుదలైన ఈ సినిమా కోలీవుడ్, టాలీవుడ్‌లోనూ ప్రేక్షకులు ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది. అటువంటిది ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి క్రేజ్ రావటం విశేషం. విడుదలైన అన్ని చోట్లా ఈ సినిమాని వీక్షించేందుకు ప్రేక్షకులు అధిక సంఖ్యలో వస్తున్నారని సినీ వర్గాల సమాచారం. రికార్డులు సృష్టించిన వై దిస్ కొలవెరి సాంగ్ ఈ చిత్రంలోనిదే.