హాట్ బ్యూటీ శ్రియ తాజాగా షేర్ చేసిన పిక్ ఒకటి వైరల్ గా మారింది. పింక్ కలర్ లో బంగారు కుట్టుతో ఉన్న స్వైన్ సూట్ ధరించి అందరినీ స్టన్ చేసింది ఈ వయ్యారి. అయితే ఈ హాట్ అవుట్ ఫిట్ ను ధరించడానికి ఓ ప్రత్యేక రీజన్ ఉందట. తన భర్త కోరికట అది. ఈ విషయాన్నీ ఆమె పిక్ షేర్ చేస్తూ పంచుకున్నారు. తన భర్త ఆండ్రీ కోస్చీవ్ వారి బీచ్ విహారయాత్రకు సాధారణంగా దుస్తులు ధరించమని అడిగాడట. “అఫ్కోర్స్… ఇది సింపుల్ అండ్ క్యాజువల్” అంటూ తన భర్త కోరికను ఇలా తీర్చేసిందట ఈ కొంటె కోణంగి. కాగా శ్రీయా శరణ్ రష్యాకు చెందిన వ్యాపారవేత్త ఆండ్రీ కోస్చీవ్‌ను 2018 లో రాజస్థాన్‌లో వివాహం చేసుకున్నారు. వివాహం తరువాత ఆమె తన భర్తతో పాటు బార్సిలోనాకు వెళ్లింది. ఇటీవల ఆమె తన భర్తతో కలిసి భారతదేశానికి తిరిగి వచ్చింది. ఇక ఆమె సినిమాల విషయానికొస్తే… దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి “ఆర్ఆర్ఆర్”లో శ్రియా శరణ్ అతిధి పాత్ర పోషించింది.
A post shared by Shriya Saran (@shriya_saran1109)