మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్‌గా, దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ మాస్ కమర్షియల్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. షూటింగ్ నుంచి వస్తున్న చిన్న చిన్న లీక్స్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.ఇక తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో మెగాస్టార్ చాలా ఇంట్రెస్టింగ్ పాత్రలో కనిపించనున్నట్లు ఫిలింనగర్ టాక్.
Also Read : Baahubali The Epic : కొత్త సన్నివేశాలతో బాహుబలి రీరిలీజ్‌లో సర్ప్రైజ్ ఎలిమెంట్స్
చిరంజీవి ఈ సినిమాలో డ్రిల్ మాస్టర్ పాత్రలో కనిపించనున్నారట! అంటే.. డిసిప్లిన్, ఎనర్జీ, యాక్షన్ మిక్స్‌తో కూడిన ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్ అని అర్థమవుతోంది. ఇక చిరంజీవి స్పెషాలిటీ అయిన కామెడీ టైమింగ్, డాన్స్ మువ్‌మెంట్స్, ఎమోషనల్ పర్ఫామెన్స్ ఇలా అన్ని షేడ్స్ ఈ పాత్రలో కనిపిస్తాయట. ఈ పాత్రను దర్శకుడు అనీల్ రావిపూడి ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకి మాస్ ఆల్ రౌండర్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సంగీతం అందిస్తుండగా, షైన్ స్క్రీన్ సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ, 2026 సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రం చిరు డ్రిల్ మాస్టర్ గెటప్ ఎలా ఉంటుందా? కామెడీ, యాక్షన్ ఎలా వర్కౌట్ అవుతాయా? అన్న ఉత్కంఠ లో ఉన్నారు. అధికారిక అప్డేట్ రావాల్సి నప్పటికీ.. లీక్ అయిన ఈ వార్త సినిమాపై మరింత హైప్‌ను పెంచింది.